యాప్నగరం

నేటి నుంచి ఈటల రాజేందర్ పాదయాత్ర.. 23 రోజులపాటు

నియోజకవర్గంలో 107 గ్రామపంచాయితీల పరిధిలోని 127 గ్రామాల్లో.. 270 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టనున్నారు ఈటల రాజేందర్. 23 రోజుల పాటు ఈటల పాదయాత్ర కొనసాగనుంది.

Samayam Telugu 19 Jul 2021, 9:08 am
మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఇవాల్టి నుంచి బీజేపీ నేత ఈటల రాజేందర్ పాదయాత్ర చేయనున్నారు. ‘ప్రజా జీవన యాత్ర’ పేరుతో ఈటల పాదయాత్ర ఉదయం 9.30 గంటలకు హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని కమలాపూర్‌ మండలం బత్తినవారిపల్లి నుంచి ప్రారంభం కానుంది. తొలి రోజు నియోజకవర్గంలోని శనిగరం, మాదన్నపేట, గునిపర్తి, శ్రీరాములపేట, అంబల గ్రామాల మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది.
Samayam Telugu ఈటల రాజేందర్


నియోజకవర్గంలోని వివిధ గ్రామాల మీదుగా 23 రోజుల పాటు ఈటల పాదయాత్ర చేయనున్నారు. మొత్తం 107 గ్రామపంచాయితీల పరిధిలోని 127 గ్రామాల్లో.. 270 కిలోమీటర్లు ఈటల రాజేందర్ పాదయాత్ర చేయనున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికపై ఈటల దృష్టి పెట్టారు. ఆమె సతీమణి, అనుచరులు, అభిమానులు సైతం ఇప్పటికే జోరుగా నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈటల కూడా పాదయాత్రకు సిద్ధమవుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.