యాప్నగరం

KCR ఎమ్మెల్యేలు, మంత్రులనే లోపలికి రానీయడు.. వాళ్లనేం దేకుతాడు, మాజీ మంత్రి సంచలనం

దళిత బంధు పథకం హుజూరాబాద్‌లో ఆరని చిచ్చు రాజేసింది. అధికార, విపక్షాలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. కేసీఆర్ అహంకారాన్ని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఈటల అన్నారు.

Samayam Telugu 21 Oct 2021, 5:25 pm
హుజూరాబాద్‌లో దళిత బంధు రేపిన చిచ్చు ఇప్పట్లో ఆరిపోయేలా కనిపించడం లేదు. దళిత బంధు పథకం నిలిచిపోవడానికి బీజేపీయే కారణమని అధికార టీఆర్‌ఎస్ చేస్తోన్న విమర్శలపై మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘాటు విమర్శలు చేశారు. దళిత బంధు తాను ఇస్తున్నట్లు.. ఇతరులు అడ్డుకుంటున్నట్లు నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడని సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు. గతంలో దళితులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
kcr


రాష్ట్రంలో 85 శాతం మంది దళితులు, బీసీలే ఉన్నారు.. దళితుడినే ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి కేసీఆర్ మాటతప్పాడని ఈటల అన్నారు. తల నరుక్కుంటానని.. కాపలా కుక్కలా ఉంటానని మొదటి ద్రోహం దళితులకే చేశాడని ఆయన ధ్వజమెత్తారు. మూడెకరాల భూమి లేదు. డబుల్ బెడ్రూం ఇళ్ల ఇవ్వలేదని విమర్శించారు. ఉప ఎన్నిక రాగానే చివరి రక్తపు బొట్టు వరకూ తన జీవితం దళితులకే అంకితమంటున్నాడని ఎద్దేవా చేశారు.

కేసీఆర్ ఎజెండా వేరని ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కొడుకు, మనవడు కూడా రాష్ట్రాన్ని ఏలాలనే ఎజెండాతో కేసీఆర్ పనిచేస్తున్నాడని ఈటల విమర్శించారు. సొంతపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులనే లోపలికి రానీయని కేసీఆర్.. వాళ్లని ఎలా దేకుతాడంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఎన్ని దావతులిచ్చినా.. ఓటుకి రూ.20 వేలిచ్చినా నమ్మరని.. కేసీఆర్ అహంకారాన్ని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. ఈ నెల 30వ తేదీన పోలింగ్ తర్వాత తనను విడిచి వెళ్లిపోయిన వాళ్ల బతుకు బయపటడుతుందని ఈటల అన్నారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.