యాప్నగరం

ఈటల ఎఫెక్ట్‌‌.. బీజేపీలో ముసలం.! కమలం పార్టీకి భారీ షాక్

బీజేపీలో ముసలం మొదలైంది. హుజూరాబాద్‌కి చెందిన కీలక నేత, మాజీ మంత్రి పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. ఈటల రాజేందర్ చేరికతోనే ఆయనలో అసంతృప్తి రగిలినట్లు తెలుస్తోంది.

Samayam Telugu 26 Jul 2021, 9:17 pm
హుజూరాబాద్‌ ఉప ఎన్నిక వేళ బీజేపీకి భారీ షాక్ తగిలింది. కమలం పార్టీకి ఊహించని షాకిచ్చారు మాజీ మంత్రి, సీనియర్ నేత ఇనుగాల పెద్దిరెడ్డి. ఈటల రాజేందర్ చేరికను తొలి నుంచీ వ్యతిరేకిస్తున్న పెద్దిరెడ్డి ఇక పార్టీలో ఇమడలేక గుడ్‌బై చెప్పేశారు. తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి రాజీనామా లేఖ పంపించారు. బీజేపీలో పనిచేసేందుకు అవకాశం కల్పించిన జాతీయ, రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపిన పెద్దిరెడ్డి.. మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా పార్టీలో కొనసాగేందుకు తన మనస్సు అంగీకరించడం లేదని.. అందుకే రాజీనామా చేస్తున్నానని ఆయన కుండబద్దలు కొట్టారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
etela


నిజానికి ఈటల రాజేందర్ చేరికతోనే పెద్దిరెడ్డిలో అసంతృప్తి మొదలైనట్లు తెలుస్తోంది. కనీసం ఎవరినీ సంప్రదించకుండా నిర్ణయం ఎలా తీసుకుంటారని ఆయన అసమ్మతి వెళ్లగక్కారు కూడా. బీజేపీ కీలక నేతల బుజ్జగింపులతో కొంత వెనక్కి తగ్గినప్పటికీ అప్పుడే ముసలం మొదలైందన్న వాదనలున్నాయి. పెద్దిరెడ్డి టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఓ వెలుగు వెలిగారు. 1994, 1999లో హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన చంద్రబాబు హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. 1999 నుంచి 2004 వరకు ఆయన చంద్రబాబు క్యాబినెట్‌లో ఉన్నారు. తదనంతర పరిణామాలతో 2019లో ఆయన బీజేపీలో చేరారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.