యాప్నగరం

హుజూరాబాద్ ఉప ఎన్నిక.. ఈసీ కీలక అప్డేట్

హుజూరాబాద్ ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల ఉప సంహరణ గడువు పూర్తయింది. విత్ డ్రాల అనంతరం బరిలో నిలిచిన అభ్యర్థులను ఈసీ ప్రకటించింది. చకచకా ఏర్పాట్లు చేస్తోంది.

Samayam Telugu 13 Oct 2021, 9:35 pm
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. నామినేషన్ల ఉప సంహరణ గడువు ముగియడంతో అధికారులు తదుపరి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు మొత్తం 30 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఎన్నికల అధికార ప్రకటించారు. బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్, టీఆర్‌ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఎన్నికల గోదాలో నిలిచారు. వారితో పాటు మరో 27 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
huzurabad


నామినేషన్ల ఉప సంహరణ గడువు ముగియడంతో అధికారికంగా 30 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఈసీ తెలిపింది. వారికి గుర్తుల కేటాయింపు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ప్రధాన పార్టీ ల గుర్తులు మినహా మిగిలిన అభ్యర్థులకు ఈసీ గుర్తులు కేటాయించింది. ఈవీఎంల వినియోగం, పనితీరుపై సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నారు. నామినేషన్ల ఉప సంహరణకు చివరి తేదీన ఈటల సతీమణి జమున తన నామినేషన్‌ను ఉప సంహరించుకున్నారు.

ఇప్పటికే అధికార టీఆర్‌ఎస్, బీజేపీ హోరాహోరీ తలపడుతున్నాయి. ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచిన బీజేపీకి ఓటేయొద్దని టీఆర్‌ఎస్ ప్రచారం హోరెత్తిస్తుంటే.. కేసీఆర్ అహంకారానికి, హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవానికి పోటీ అని బీజేపీ అభ్యర్థి ఈటల ప్రచారంలో దూసుకుపోతున్నారు. మంత్రి హరీశ్ వర్సెస్ ఈటలగా వార్ కొనసాగుతోంది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.