యాప్నగరం

అమెరికాలో అనారోగ్యంతో హుజూరాబాద్ వాసి మృతి

తమ బిడ్డ వస్తే పెళ్లి చేద్దామని తల్లిదండ్రులు అతడి కోసం సంబంధాలు కూడా చేస్తున్నారు. ఈలోపే అమెరికాలో తమ బిడ్డ అకాలమరణంతో వారు కన్నీరుమున్నీరవుతున్నారు.

Samayam Telugu 20 Jan 2021, 11:33 am
ఉన్నత చదువులు ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లిన కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. తన బిడ్డ వస్తాడని కుమారుడి కోసం ఎదురుచూస్తున్న ఆ తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చాడు. అమెరికాలో హుజూరాబాద్‌ వాసి అనారోగ్యంతో మృతిచెందాడు. హుజూరాబాద్‌ పట్టణంలోని విద్యానగర్‌ కాలనీకి చెందిన పంబిడి జగన్‌మోహన్‌రావు, లక్ష్మి దంపతుల కుమారుడు నిఖిల్‌రావు(29). ఎంఎస్‌ చదివేందుకు 2015లో అమెరికా వెళ్లాడు. చదువు పూర్తి చేసుకొని అక్కడే సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేస్తున్నాడు. అతన్ని స్వగ్రామం రావాలని తల్లిదండ్రులు పలుమార్లు కోరారు.
Samayam Telugu అమెరికాలో హుజూరాబాద్ వాసి మృతి


Read More: హైదరాబాద్‌లో స్వామీజీ కిడ్నాప్‌కు యత్నం.. గుండెపోటు రావడంతో

కానీ హెచ్‌1బీ వీసా ఆలస్యమవడంతో అమెరికాలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో నిఖిల్‌రావు ఈ నెల 17న అనారోగ్య సమస్యలతో మృతిచెందాడు. అమెరికాలోని బంధువుల ద్వారా కుమారుడి మరణ వార్త తెలుసుకున్న అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అమెరికా నుంచి కొడుకు వస్తే వివాహం చెద్దామనుకున్నామని, ఇంతలోనే అతడి చావు వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదన్నారు. నిఖిల్‌రావు మృతదేహం వారం రోజుల్లో స్వగ్రామం చేరనున్నట్లు బాధిత బంధువులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.