యాప్నగరం

Balka Suman: తుపాకీ బుల్లెట్స్‌తో 'జై బాల్క సుమన్' స్టేటస్..!

Balka Suman: తెలంగాణలో రాజకీయ నేతలపై ఉన్న అభిమానం కొన్నిసార్లు హద్దులు దాటుతోంది. ఫలితంగా అటు అభిమానులు.. ఇటు నేతలు ఇబ్బందుల పాలవుతున్నారు. తాజాగా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అనుచరుడు రవి అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఏకంగా తుపాకీ బుల్లెట్లతో 'జై బాల్క సుమన్' అని వాట్సప్ స్టేటస్ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఈ ఇష్యూ చర్చనీయాంశం అయ్యింది.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 29 Sep 2022, 6:09 pm

ప్రధానాంశాలు:

  • బాల్క సుమన్ అనుచరుడు రవి అత్యుత్సాహం
  • తుపాకీ బుల్లెట్లతో 'జై బాల్క సుమన్' అని స్టేటస్
  • బుల్లెట్లపై ఆరా తీస్తున్న పోలీసులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Koppula Ravi with Balka Suman
బాల్క సుమన్‌తో కొప్పుల రవి
Balka Suman: నేతలపై తమకున్న అభిమానాన్ని చాటుకోవడానికి కొత్త కొత్త మార్గాలు వెతుకుతున్నారు. ఆ క్రమంలో సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా.. మంచిర్యాల జిల్లాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అభిమాని ఒకరు అత్యుత్సాహం ప్రదర్శించారు. బాల్క సుమన్ అనుచరుడు కొప్పుల రవి.. తుపాకీ బుల్లెట్స్‌తో 'జై బాల్క సుమన్' అని వాట్సప్ స్టేటస్ (Whatsapp Status with Bullets) పెట్టుకున్నాడు. సీఎం కేసీఆర్ సింగరేణిలో లాభాల వాటాను ప్రకటించిన సందర్భంగా.. ఆ సంస్థలో పనిచేసే రవి ఇలా వాట్సప్ స్టేటస్ పెట్టుకోవడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.
రవి వాట్సప్ స్టేటస్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ స్టేటస్ పెట్టిన రవి.. ప్రస్తుతం శ్రీరాంపూర్ డివిజన్‌లో సింగరేణి కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే.. ఒక సింగరేణి కార్మికుడికి బుల్లెట్లు ఎక్కడినుంచి వచ్చాయనే చర్చ జరుగుతోంది. ఈ కోణంలోనే పోలీసులు (Police) ఆరా తీస్తున్నారు. రవి పెట్టిన స్టేటస్‌లో దాదాపు 62 బుల్లెట్లు కనిపిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇన్ని బుల్లెట్లు ఓ సామాన్య వ్యక్తికి ఎలా వచ్చాయనేది ఇప్పుడు టాక్ ఆఫ్ ది తెలంగాణగా మారింది.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.