యాప్నగరం

ఈటలతో భేటీ.. కేసీఆర్‌కి మరో షాకివ్వాలంటున్న సర్దార్

ఉద్యమ ద్రోహులకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ విమర్శించారు. నిన్న హుజూరాబాద్‌లో వచ్చిన పలితమే కరీంనగర్‌లోనూ రిపీట్ కావాలన్నారు.

Samayam Telugu 2 Dec 2021, 9:37 pm
హుజూరాబాద్ ఉప ఎన్నిక పుణ్యమాని కేసీఆర్ వ్యతిరేకులంతా ఒక్కతాటిపైకి వచ్చే ప్రయత్నం చేశారు. మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఏపీ జితేందర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి వంటి నేతలు కేసీఆర్ టార్గెట్‌గా ఈటల గెలుపు కోసం కృషి చేశారు. అధికార పార్టీ అంగబలం, అర్థబలాన్ని ఎదిరించి ఈటల ఘన విజయం సాధించి సంచలనం సృష్టించారు. తాజాగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కేసీఆర్ వ్యతిరేక పవనాలు వీచే అవకాశాలు కన్పిస్తున్నాయి.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
eatala rajender


ఎమ్మెల్సీగా అవకాశం రాకపోవడంతో గులాబీ పార్టీ నుంచి బయటికొచ్చేసిన కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు కేసీఆర్ వ్యతిరేకులతో భేటీ అవుతూ ఆసక్తి రేపుతున్నారు. ఇప్పటికే కేసీఆర్ సర్కార్‌పై గుర్రుగా ఉన్న ఎంపీటీసీ సంఘాల నేతలను కలిసి మద్దతు కోరారు. అనూహ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేతలు, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కలిసి గెలిపించాలని విన్నవించుకున్నారు.

తాజాగా ఆయన హుజూరాబాద్ విన్నర్ ఈటల రాజేందర్‌ని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ధర్మరాజ్‌పల్లిలో ఈరోజు రవీందర్ సింగ్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను కలిశారు. తనకు మద్దతు కావాలని ఆయన ఈటలని కోరారు. అలాగే మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభను కూడా తనకు అండగా నిలవాలని అభ్యర్థించారు. గులాబీ పార్టీ నుంచి బయటికొచ్చేసిన నేతలు ఒక్కచోట కలిసి పార్టీలకు అతీతంగా మద్దతు కోరడం ఆసక్తికరంగా మారింది. అయితే కాంగ్రెస్, బీజేపీ ఎటు సపోర్ట్ చేస్తాయో వేచిచూడాలి మరి.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.