యాప్నగరం

కూలిన సభా వేదిక.. మంత్రి గంగులకు గాయాలు.. విరిగిన జడ్పీటీసీ సభ్యుడి కాలు

Karimnagar: మంత్రి గంగుల కమలాకర్‌కు పెను ప్రమాదం తప్పింది. చెర్లబూట్కూర్ ఆయన ఓ కార్యక్రమలో పాల్గొన్న అక్కడ ఏర్పాటు చేసిన సభా వేదిక కూలి గంగుల సహా ఇతర నేతలు కిందపడిపోయారు. ఈ ఘటనలో మంత్రి గంగుల కాలుకు స్వల్ప గాయం కాగా.. ఓ జడ్పీటీసీ సభ్యుడి కాలు విరిగింది.

Authored byసందీప్ పూల | Samayam Telugu 16 Apr 2023, 4:36 pm

ప్రధానాంశాలు:

  • మంత్రి గంగులకకు తప్పిన ప్రమాదం
  • సభా వేదిక కూలి కిందపడిపోయిన మంత్రి
  • మంత్రి కాలికి స్వల్ప గాయం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu gangula kamalakar
గంగుల కమలాకర్
Gangula Kamalakar: తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమాలాకర్‌కు పెను ప్రమాదం తప్పంది. కరీంనగర్ జిల్లా చెర్లబూట్కూర్ లో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొన్నారు. సభా వేదిక ఒక్కసారిగా కుప్పకూలడంతో మంత్రి గంగుల సహా ఇతర నేతలు కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో మంత్రి గంగుల కాలుకు స్వల్పగాయమైంది. ఇదే సభలో పాల్గొన్న ఓ జడ్పిటీసీ సభ్యుని కాలు విరగడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
గంగుల కమలాకర్‌ను కూడా ఆసుపత్రికి తరలించగా.. డాకర్లు ఆయన కాలుకు కట్టుకట్టారు. ప్రమాదంపై స్పందించిన మంత్రి.. తనకు చిన్న గాయమే అయిందని చెప్పారు. డాక్టర్లు ఫస్ట్ ఎయిడ్ చేసి బ్యాండేజీ వేశారన్నారు. తనను విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించినట్లు చెప్పారు. అయితే పరిమితికి మంచి సభా వేదికపై నేతలు ఎక్కటంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో గంగుల స్వల్ప గాయంతో బయటపడటంతో ఆయన అనుచరులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.


Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.