యాప్నగరం

గవర్నర్‌తో మాకే పంచాయతీ లేదు.. ఆమె ఏదో ఊహించుకుంటున్నారు: కేటీఆర్

గవర్నర్ తమిళిసై వ్యవహారంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. గవర్నర్ అంటే తమకు ఎంతో గౌరవం ఉందని.. ఆమె మాత్రం ఏదో ఊహించుకుంటున్నారని పేర్కొన్నారు.

Samayam Telugu 7 Apr 2022, 5:50 pm
తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగబద్ధ పదవిని అవమానపరిచేలా వ్యవహరిస్తోందంటూ గవర్నర్ తమిళిసై ఢిల్లీలో చేసిన ఆరోపణలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ... గవర్నర్ తమిళిసై అంటే తమకెంతో గౌరవమని, ఆమెను తామెక్కడా అవమానించలేదన్నారు. గవర్నర్‌తో తమ ప్రభుత్వానికి పంచాయతీ ఏమీ లేదని చెప్పిన కేటీఆర్... ఆమెకు ఆమె ఏదో ఊహించుకుంటే తామేం చేయాలని ప్రశ్నించారు. గవర్నర్‌కి ఎక్కడా అవమానం జరగలేదని.. నిజంగా జరిగితే ఎక్కడ, ఎలా జరిగిందో ఆమె వెల్లడించాలని కోరారు.
Samayam Telugu Image

గవర్నర్ తమిళిసై ఢిల్లీ పర్యటన.. తెలంగాణలో పొలిటికల్ ప్రకంపనలు
కౌశిక్ రెడ్డికి రాజకీయ నేపథ్యం ఉన్నందునే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ తిరస్కరించడంతో కక్షగట్టి తనను ఇబ్బంది పెడుతున్నారని గవర్నర్ తమిళిసై వ్యాఖ్యానించడం సరికాదని కేటీఆర్ పేర్కొన్నారు. ఆమె తెలంగాణకు గవర్నర్‌గా రాకముందు తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న సంగతి నిజం కాదా? అని ప్రశ్నించారు. రాజకీయ నేపథ్యం ఉన్న తమిళిసై ఓ రాష్ట్రానికి గవర్నర్ అవ్వొచ్చు గానీ.. రాజకీయ నేపథ్యం ఉన్న కౌశిక్ రెడ్డి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఎందుకు కాకూడదని ప్రశ్నించారు. గత గవర్నర్ నరసింహన్‌తో ఎప్పుడూ ప్రభుత్వానికి ఇలాంటి సమస్యలు రాలేదని కేటీఆర్ గుర్తుచేశారు.
పార్లమెంటు ఆవరణలో ఊహించని ఘటన... గవర్నర్ తమిళిసైతో టీఆర్ఎస్‌ ఎంపీ కేకే ముచ్చట
ఢిల్లీ పర్యటనకు వెళ్లిన గవర్నర్ తమిళిసై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె మీడియాతో చేసిన వ్యా్ఖ్యలు ప్రస్తుతం తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. తమిళిసై‌గా తనను పట్టించుకోకపోయినా.. కనీసం గవర్నర్ పదవిని గౌరవించాలని ఆమె కోరారు. రాజ్‌భవన్‌, గవర్నర్‌ను కావాలనే అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎవరినీ విమర్శించడం లేదని, రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితిని మాత్రమే వివరిస్తున్నానని తెలిపారు. ఓ మహిళను గౌరవించే విధానం ఇది కాదన్న తమిళిసై.. సోదరిగా భావిస్తే ఇలా అవమానిస్తారా? అని ప్రశ్నించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.