యాప్నగరం

ఇంట్లో ఒంటరిగా నవవధువు.. దుండగులు చొరబడి దారుణం

రెండు నెలల క్రితమే ప్రవళిక, అనిల్‌కు వివాహం జరిగింది. అయితే ప్రవళిక ఇంట్లో ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఆమెను హత్య చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.

Samayam Telugu 24 Jul 2021, 7:52 am

ప్రధానాంశాలు:

  • ప్రవళిక, అనిల్ పెళ్లై రెండు నెలలు
  • అత్తగారింట్లో ఉంటున్న ప్రవళిక
  • గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి హత్య
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
నవవధువు దారుణ హత్యకు గురైంది. ఇంట్లోనే యువతిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ ఘటన శుక్రవారం కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో నవవధువు హత్య కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూరాబాద్ ప్రాంతానికి చెందిన మ్యాధర ప్రవళిక( 21)కు బొమ్మనపల్లికి చెందిన మ్యాదర అనిల్ (28)తో రెండు నెలల క్రితమే పెళ్లి జరిగింది.
శుక్రవారం మధ్యాహ్నం యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు ప్రవళిక( 21)ను దారుణంగా హత్య చేశారని స్థానికులు పేర్కొన్నారు. భర్త అనిల్ హుస్నాబాద్‌లో బ్యాటరీ షాపు నడుపుతున్నాడు. అనిల్ తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో దుండగులు ఈ హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభినట్టు తెలిపారు. హత్యకు పాల్పడిన నిందితులను పట్టుకుంటామని సీపీ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.