యాప్నగరం

సీఎం సొంత జిల్లా త్వరలో రాజన్న సిరిసిల్ల.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

Manakondur: తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు ఖాయం అంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కేటీఆర్‌ సీఎం అయితే తప్పేంటి అంటూ మద్దతు పలుకుతూ వస్తున్నారు.

Samayam Telugu 23 Jan 2021, 3:37 pm
తెలంగాణ ముఖ్యమంత్రి సొంత జిల్లా త్వరలో రాజన్న సిరిసిల్ల జిల్లా కానుందని మానకొండూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. దీంతో త్వరలో ముఖ్యమంత్రిగా కేటీఆర్ కానున్నారని ఆయన పరోక్షంగా అన్నట్లయింది. ఇల్లంతకుంట మండలంలో నిర్వహించిన టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యవర్గ సమావేశంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఈ వ్యాఖ్యలు చేశారు. రసమయి బాలకిషన్‌ వ్యాఖ్యలతో టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది.
Samayam Telugu ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ (ఫైల్ ఫోటో)
Rasamayi Balakishan


తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు ఖాయం అంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే చాలా తరచుగా ఈ వ్యాఖ్యలు చేస్తుండడం, ప్రతిపక్ష నాయకులు కూడా దీనిపై వ్యాఖ్యలు చేస్తుండడంతో ఇదే నిజమే అనే సందేహం జనాల్లో వస్తోంది. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కేటీఆర్‌ సీఎం అయితే తప్పేంటి అంటూ మద్దతు పలుకుతూ వస్తున్నారు. ఇక డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌ ఒకడుగు ముందుకేసి నేరుగా కేటీఆర్‌ ముందే ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాక, మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ ఖాయమంటూ వ్యాఖ్యలు చేశారు.

ఈ క్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కూడా మరో అడుగు ముందుకేసి మాట్లాడారు. అభివృద్దిలో రాష్ట్రంలోనే రాజన్న సిరిసిల్లా జిల్లాను గౌరవ మంత్రి కేటీఆర్ ముందు వరుసలో నిలిపారని చెప్పారు. త్వరలోనే రాజన్న సిరిసిల్ల జిల్లా సీఎం జిల్లాగా మారబోతుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో సభలో ఉన్నవారందరిలో ఉత్సాహం కనిపించింది. వారంతా చప్పట్లతో ప్రాంగణాన్ని మార్మోగించారు.

తప్పక చదవాల్సినది:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.