యాప్నగరం

KCR సారూ దయచూపండి.. ముగ్గులతో ఉపాధ్యాయుల వినూత్న నిరసన

రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బదిలీల్లో తమకు న్యాయం చేయాలంటూ ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నారు. సంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి సంబురాలు చేసుకోవాల్సిన టీచర్లు వినూత్నంగా నిరసన తెలియజేస్తున్నారు.

Samayam Telugu 15 Jan 2022, 3:00 pm
ఉద్యోగుల బదిలీల విషయంలో తమకు అన్యాయం జరిగిందని భావిస్తున్న ఉఫాధ్యాయులు ప్రభుత్వానికి వినూత్నంగా తమ నిరసన తెలియజేస్తున్నారు. సంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి సంబురాలు చేసుకోవాల్సిన టీచర్లు వినూత్నంగా తమ గోడును ముగ్గుల ద్వారా ప్రభుత్వానికి వెళ్లబోసుకుంటున్నారు. భోగి పండగ రోజున తమ ఇళ్ల ముందు ముగ్గులు వేసి... అందులో జీవో 317ని సవరించాలంటూ ప్రభుత్వానికి విన్నవించారు.
Samayam Telugu Image


కరీంనగర్‌ జిల్లాకు చెందిన టీచర్లు సంక్రాంతి రోజున జిల్లా కలెక్టరేట్ ఆవరణలో రంగవళ్లులు వేసి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో వేసిన ముగ్గుల్లో ‘తల్లో దిక్కు, తండ్రో దిక్కు… పిల్లలకు ఎవరు దిక్కు’, ‘భార్య ఓ చోట భర్త ఓ చోట ఇదేమి న్యాయం ఇదేమి న్యాయం’, ‘దయతో దంపతులను కలపండి’, ‘ముఖ్యమంత్రి మాటే ముద్దు.. దంపతులు విడిగా వద్దు’ అన్న నినాదాలతో తమ డిమాండ్లను తీర్చాలంటూ కోరుతున్నారు.

ఈ విధంగా అనేక జిల్లాల్లో టీచర్లు ముగ్గుల ద్వారా తమ నిరసన తెలియజేశారు. కొంతమంది టీచర్లు తమ ఇళ్ల వద్ద ముగ్గులు వేసి ‘అన్ బ్లాక్ 13 డిస్ట్ట్రిక్స్ ఫర్ స్పౌజ్’ అని ముఖ్యమంత్రిని కోరారు. స్పౌజ్ గ్రౌండ్ విధానంతో భార్య భర్తలు ఒకే చోట ఉండేలా చొరవ తీసుకోవాలని టీచర్లు కోరుతున్నారు. కరీంనగర్ కలెక్టరేట్లో టీచర్లు చేపట్టిన వినూత్న నిరసన పండగ పూట హాట్‌టాపిక్‌గా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.