యాప్నగరం

పుట్టా మధు అరెస్టు: ఆ 2 కోట్లు ఎందుకు? ప్రశ్నల వర్షం కురిపించిన పోలీసులు

Telangana Police: వివిద కోణాల్లో పుట్టా మధును పోలీసులు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో పుట్టా మధు కుటుంబసభ్యులను కూడా పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది.

Samayam Telugu 8 May 2021, 5:45 pm
పెద్దపల్లి జిల్లా జడ్పీ ఛైర్మన్ పుట్టా మధును పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరంలో పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు ఆయన్ను విచారణ జరుపుతున్నారు. ‘‘ఇన్ని రోజులు ఫోన్ స్విచ్చాఫ్ చేసి పది రోజులు ఎక్కడికెళ్లారు? వామన్ రావు హత్య కేసులో మేనల్లుడి పాత్ర ఉందా? గడిచిన పదిరోజుల్లో ఎక్కడెక్కడ తిరిగారు? అంత రహస్యంగా ఎందుకు తిరగాల్సి వచ్చింది? వామన్‌రావుతో మీకు ప్రత్యక్షంగా ఉన్న విభేదాలు ఏమిటీ? వామన్‌రావు హత్యతో మీకు పరోక్ష సంబంధం ఉందని ఎందుకు ఆరోపణలు వస్తున్నాయి? వామన్‌రావు హత్య కేసులో ప్రధాన నిందితులు వాడిన కారు మీదేనా? వామన్‌రావు హత్యకు రెండు రోజుల ముందు బ్యాంకు నుంచి రూ.2 కోట్లు ఎందుకు తీసుకున్నారు? వంటి కోణాల్లో పుట్టా మధును పోలీసులు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో పుట్టా మధు కుటుంబసభ్యులను కూడా పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది.
Samayam Telugu పుట్టా మధు (ఫైల్ ఫోటో)
putta madhu


వామన్‌ రావు దంపతుల హత్య కేసులో ఆదివారం పుట్టా మధును కోర్టులో హాజరుపర్చే అవకాశం ఉంది. మరోవైపు వామన్ రావు దంపతుల హత్య కేసు విచారణ కోసం ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రభుత్వం హైకోర్టుకు లేఖ రాసింది. కరీంనగర్‌లోని ఓ కోర్టును ఈ విచారణకు కేటాయించాలని ప్రభుత్వం కోరింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.