యాప్నగరం

వామన్ రావు హత్య కేసు.. తండ్రి సంచలన వ్యాఖ్యలు

వామన్ రావు హత్య కేసుపై తాజాగా ఆయన తండ్రి కిషన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తన కొడుకు హత్య వెనుక రాజకీయ ప్రమేయం ఉందన్నారు. స్థానిక పోలీసులపై ఆయనకు నమ్మకం లేదన్నారు.

Samayam Telugu 27 Feb 2021, 2:55 pm
న్యాయవాది వామన్ రావు దంపతుల హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. వామన్ రావుతో పాటు.. ఆయన భార్యను కూడా నడిరోడ్డుపై కొందరు అతి దారుణంగా హతమార్చారు. పెద్దపల్లి జిల్లాలోని మంథని సమీపంలో హైకోర్టు న్యాయవాది వామనరావు దంపతులను కిరాతకంగా చంపేశారు. పట్టపగలు అందరూ చూస్తుండగానే హత్య జరగడంతో ఆ ప్రాంతం మొత్తం ఉలిక్కిపడింది.
Samayam Telugu వామన్ రావు దంపతుల హత్య కేసు
vaman rao murder case


అయితే ప్రతిపక్షాలు ఈ హత్యపై నిరసనలు తెలియజేశాయి. నిందితులకు కఠిన శిక్ష విధించాలని విజ్ఞప్తి చేశాయి. అటు న్యాయవాదులు కూడా ఆందోళనలు, ర్యాలీలు నిర్వహించారు. అయితే తాజాగా వామనరావు దంపతుల హత్యపై అయన తండ్రి కిషన్ రావు స్పందించారు. వామనరావు హత్య కేసులో రాజకీయ ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. స్థానిక పోలీసులపై తనకు నమ్మకం లేదన్నారు. ఆలయ వివాదం వల్లే హత్య జరిగిందని అంటున్నారని, కానీ, అది అవాస్తవం అన్నారు కిషన్ రావు. అవినీతిపై పోరాటం చేస్తున్నందుకే తన కుమారుడు హత్యకు కుట్ర జరిగిందని తెలిపారు. హత్యతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి శిక్షపడాలని డిమాండ్ చేశారు వామనరావు తండ్రి కిషన్ రావు.

మరోవైపు న్యాయవాదుల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిట్టు శ్రీనుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అతన్ని కరీంనగర్‌ జైలుకు పోలీసులు తరలించారు. ఈ హత్య కేసులో కత్తులను సరఫరా చేయడంతో పాటు వారికి వాహనం కూడా సమకూర్చాడని, కుంట శ్రీనుతో కలిసి హత్యకు ప్లాన్ వేసినట్లు బిట్టు శ్రీనుపై ఆరోపణలు ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.