యాప్నగరం

వేములవాడ: నిండిన హుండీలు.. భక్తుల కానుకలు స్వీకరించని ఆలయాధికారులు!

వేములవాడ రాజన్న సన్నిధికి భక్తుల తాకిడి పెరిగింది. దీంతో ఆలయంలోని హుండీలన్నీ నిండిపోాయాయి. ఫలితంగా భక్తులు ఎక్కడపడితే అక్కడ కానుకలు వేయాల్సి వచ్చింది.

Samayam Telugu 16 Feb 2021, 4:17 pm
వేములవాడ రాజన్న ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. దీంతో కానుకలు సమర్పించడం కోసం గర్భగుడి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హుండీలన్నీ సోమవారం మధ్యాహ్నం నాటికి నిండిపోయాయి. ఫలితంగా ఆలయ అధికారులు భక్తుల నుంచి కానుకలను స్వీకరించలేదు. కానుకలు తీసుకోవడానికి ఏర్పాట్లు సైతం చేయకపోవడంతో.. భక్తులు తమ కానుకలను ఆలయంలో ఎక్కడపడితే అక్కడ సమర్పించి వెళ్లారు.
Samayam Telugu vemulawada temple hundi counting (File Photo)


భక్తులు సమర్పించిన కానుకలను ఆలయ సిబ్బంది జేబుల్లో నింపుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్ స్పందించారు. బ్యాంకులో చిల్లర నాణేలు తీసుకోకపోవడంతో.. హుండీ లెక్కింపు ఆలస్యమైందని.. అందుకే హుండీలు నిండిపోయాయని ఈవో తెలిపారు. ఈ విషయాన్ని దేవాదాయ శాఖ దృష్టికి తీసుకెళ్తామన్నారు. నిండిన హుండీల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ఆలయ నిర్వహణ సరిగా లేదని.. రాజన్న దర్శనానికి వెళ్లిన భక్తులు చెబుతుండటం గమనార్హం. నిండిన వాటిని సీల్ చేసి కొత్త హుండీలను పెట్టడానికి ఆలస్యం ఎందుకని కొందరు భక్తులు ప్రశ్నించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లోని భక్తుల వాహనాలు దొంగతనానికి గురవుతుండటంతో.. ఆలయ ఉద్యోగి ఒకరు తన బండిని లడ్డూ కౌంటర్ పక్కన పార్కింగ్ చేసి.. ఐరన్ జాలీలు తీయడానికి వీల్లేకుండా తాళం వేసుకున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.