యాప్నగరం

మా ఆయన లేనప్పుడు బావ వచ్చి.. వివాహిత ఏడుస్తూ.! దారుణం

డబ్బులు అప్పు ఇచ్చానని అబద్దాలు చెబుతూ కోరిక తీర్చాలని బావ వేధిస్తున్నాడని వివాహిత వాపోయింది. ఆయన వేధింపులు భరించలేకపోతున్నానంటూ సెల్ఫీ వీడియో తీసుకుని ఆమె ఆత్మహత్య చేసుకుంది.

Samayam Telugu 2 Dec 2021, 6:56 pm
తమ్ముడి భార్యపై కన్నేసిన కీచక బావ వేధింపులు భరించలేక మరదలు బలవన్మరణానికి పాల్పడిన ఘటన కరీంనగర్‌లో తీవ్ర కలకలం రేపుతోంది. కరీంనగర్‌లోని కాపు వాడకు చెందిన అరుణ ఈరోజు మధ్యాహ్నం అఘాయిత్యం చేసుకుంది. తన కోరిక తీర్చాలంటూ బావ కనకయ్య వేధింపులకు గురిచేస్తున్నాడని.. భరించలేక చనిపోతున్నానంటూ ఆమె సెల్ఫీ వీడియో తీయడంతో వైరల్‌గా మారింది. తాను లొంగడం లేదని డబ్బులు ఇవ్వాలని అబద్దాలు చెబుతున్నాడని.. లైంగిక వేధింపులు భరించలేక చనిపోతున్నానని ఆమె వీడియోలో తెలిపింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
woman


తన భర్త లేని సమయంలో ఇంటికొచ్చి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని.. పిల్లలకు తన గురించి చెడుగా చెబుతానని బెదిరించాడని ఆమె వాపోయింది. పక్కలో పడుకోవాలని వేధిస్తున్నాడని భోరున ఏడుస్తూ బాధపడింది. కరోనా సమయంలో తన భర్తకి పది వేలు అప్పు ఇచ్చాడని.. అవి కాకుండా తనకు 30 వేలు అప్పు ఇచ్చినట్టు అబద్దాలు చెబుతూ లొంగదీసుకోవాలని చూస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. పోలీస్ స్టేషన్‌కి పోతే పరువు పోతుందని.. అందుకే చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపింది. సూసైడ్ లెటర్ రాసి పెట్టి ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. లైంగిక వేధింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.