యాప్నగరం

కేటీఆర్ ఇలాకాలో షర్మిల.. అపురూపమైన కానుక అందజేసిన నేతన్న

తెలంగాణలో రాజన్న రాజ్యాన్ని తీసుకురావడమే తన లక్ష్యమని ప్రకటించిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె షర్మిల... అందుకు తగ్గట్టుగానే అడుగులు వేస్తున్నారు.

Samayam Telugu 25 Jun 2021, 12:05 pm

ప్రధానాంశాలు:

  • వచ్చే నెలలో పార్టీ ప్రకటించనున్న షర్మిల.
  • జిల్లాల్లో కొనసాగుతున్న కమిటీల ఏర్పాటు.
  • కేటీఆర్ నియోజకవర్గంలో నేడు పర్యటన.
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu కరీంనగర్‌లో షర్మిల
తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటుచేస్తున్నట్టు ప్రకటించిన వైఎస్ షర్మిల.. అందుకు కార్యాచరణను రూపొందిస్తున్నారు. ఈ కార్యాచరణలో భాగంగా షర్మిల జిల్లాల్లో పర్యటిస్తున్నారు. తాజాగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో షర్మిల పర్యటిస్తున్నారు. కార్మిక క్షేత్రం సిరిసిల్లలో జిల్లాలో షర్మిలకు వైఎస్ఆర్ అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఏర్పాటు చేయబోయే కొత్త పార్టీ సన్నాహక కమిటీ సభ్యులు ఆమెకు స్వాగతం పలికారు. సిరిసిల్లలోని డాక్టర్ పెంచలయ్య ఇంటికి వెళ్లిన షర్మిలకు.. అగ్గిపెట్టెలో ఇమిడే చీరలను ఆయన బహుకరించారు.
బ్రేక్ ఫాస్ట్ అనంతరం పార్టీ అభిమానులను పలుకరించిన షర్మిల.. ఎల్లారెడ్డిపేట మండలం ఆల్మాస్‌పూర్‌లో కరోన బాధిత కుటుంబాలను పరమర్శించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని 14 కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్థిక సహాయం చేయనున్నారు. అనంతరం కరీంనగర్‌లో లంచ్ చేసి సింగరేణి కార్మికులను కలవనున్నారు. తమ సమస్యలపై సింగరేణి కార్మికుల నుంచి వినతి పత్రాన్ని స్వీకరించనున్నారు. తొలిసారి రాజన్న సిరిసిల్ల జిల్లాకు షర్మిల రావడంతో అభిమానులనుంచి అపూర్వ స్వాగతం లభించింది.

‘సకల జనుల తెలంగాణే లక్ష్యంగా ముందుకు సాగుతానని.. త్వరలో మంచి రోజులొస్తున్నాయని ప్రజలకు భరోసా ఇచ్చారు. ముసలవ్వలు నడిచేందుకు ఊతకర్రనవుతానని, బడి ఫీజులు కట్టలేక అవస్థలు పడుతున్న ఇంటికి పెద్దక్కనవుతాను ’అని గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో షర్మిల పేర్కొన్నారు.
డిగ్రీ పట్టా పట్టుకొని రోడ్డు మీదకొచ్చే తమ్ముళ్లు, చెల్లెమ్మల కోసం ఉద్యోగ బాటలు వేస్తానని తెలిపారు. చిన్నారులకు నాణ్యమైన విద్యను అందిస్తానన్నారు. మెరుగైన వైద్యం కోసం పడిగాపులు కాసే పరిస్థితిని సమూలంగా మార్చేస్తానని చెప్పారు.

తెలంగాణలో రాజన్న రాజ్యాన్ని తీసుకురావడమే తన లక్ష్యమని ప్రకటించిన ఆమె... అందుకు తగ్గట్టుగానే అడుగులు వేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసీఆర్ పై అవకాశం దొరికినప్పుడల్లా తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు. తద్వారా టీఆర్ఎస్ కు తామే ప్రత్యర్థులమనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.