యాప్నగరం

సాయిగణేష్‌తో నిశ్చితార్థం అయిన యువతి ఆత్మహత్యాయత్నం

సాయి గణేష్ ఆత్మహత్యను మరిచిపోయే క్రమంలో శనివారం అతనికి కాబోయే భార్య ఎరుగంటు విజయ శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో ఖమ్మం పట్టణంలో కలకలం రేగింది.

Authored byవీరేష్ బిళ్ళ | Samayam Telugu 30 Apr 2022, 7:57 pm
ఖమ్మం నగరంలో బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య ఘటన తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. సాయిగణేష్ ఆత్మహత్యకు మంత్రి పువ్వాడ అజయ్ కుమారే కారణమంటూ బీజేపీ శ్రేణులు ఆయన ఫ్లెక్సీలు చించివేసి నిరసన తెలిపాయి. ఈ ఘటనపై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా సాయిగణేష్ కుటుంబసభ్యులను ఫోన్లో పరామర్శించారు. అయితే ఇప్పుడిప్పుడే సాయిగణేష్ ఆత్మహత్యను మరిచిపోతున్న సమయంలో శనివారం అతడితో నిశ్చితార్థం అయిన యువతి ఎరుగంటు విజయం ఆత్మహత్యకు యత్నించింది.
Samayam Telugu Image


సాయిగణేష్‌కు విజయతో గతంలోనే నిశ్చితార్థం జరగ్గా... మే 4న వారి వివాహం చేయాలని పెద్దలు ముహూర్తం నిర్ణయించారు. ఈలోపే వేధింపులు భరించలేక సాయిగణేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో షాక్‌కు గురైన విజయకు కుటుంబసభ్యులు, బంధువులు, మహిళా సంఘాల నేతలు కొండంత ధైర్యాన్ని కల్పించారు. అయితే కొద్దిరోజుల పాటు బాగానే ఉన్న విజయ శనివారం సాయిగణేష్‌ స్మారకంగా నిర్మిస్తున్న స్థూపం వద్దకు శనివారం వచ్చింది. కాసేటికే అక్కడ నిద్రమాత్రలు మింగేసింది. ఆమెను గమనించిన కుటుంబసభ్యులు విజయను హుటాహుటిన ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపైట బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ విచారం వ్యక్తం చేశారు. సాయిగణేష్ దూరమయ్యాడన్న మనస్తాపంతోనే విజయ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిపారు.
రచయిత గురించి
వీరేష్ బిళ్ళ
వీరేశ్ బిల్లా సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ రాజకీయ, సినీ రంగాలకు చెందిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. దీంతో పాటు వీడియో టీమ్‌కు సేవలు అందిస్తున్నారు. తనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయాలు, క్రీడలు, సినిమా రంగాలకు సంబంధించి ఆర్టికల్స్ రాశారు... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.