యాప్నగరం

కొత్తగూడెం: అమెరికా అమ్మాయితో.. తెలుగు అబ్బాయి ప్రేమ పెళ్లి

అమెరికాలో ఉద్యోగం చేస్తున్న తెలుగు అబ్బాయి.. అక్కడి అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. గురువారం కొత్తగూడెంలో వీరిద్దరూ హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లాడారు.

Samayam Telugu 8 Jan 2021, 12:48 pm
ఉద్యోగం కోసం అమెరికా వెళ్లిన తెలుగబ్బాయి.. అక్కడి అమ్మాయి ప్రేమలో పడ్డాడు. ఆమె సైతం అతణ్ని ప్రేమించింది. వీరిద్దరి ప్రేమకు అమ్మాయి తల్లిదండ్రులు అంగీకరించారు. స్వదేశం వచ్చి పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అనుకుంటున్న తరుణంలో కరోనా మహమ్మారి అడ్డుపడింది. లాక్‌డౌన్ కారణంగా పెళ్లి చేసుకోవడానికి ఏడాదిపాటు నిరీక్షించాల్సి వచ్చింది. ఎట్టకేలకు జనవరి 7న వీరిద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ ప్రేమ పెళ్లి వివరాల్లోకి వెళ్తే..
Samayam Telugu marriage


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్‌ మండలంలోని అంజనాపురానికి చెందిన ఆచంట వెంకట మోహన్ రావు, శ్రీలత దంపతులు కుమారుడు రాజీవ్.. డెట్రాయిట్‌లో ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడే ఎలిజబెత్‌ అనే అమ్మాయిని ప్రేమించాడు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు అంగీకరించాయి.

దీంతో డిసెంబర్ 30న ప్రేమికులిద్దరూ అమెరికా నుంచి అంజనాపురం వచ్చారు. గురువారం సాయంత్రం కొత్తగూడెంలో హిందూ సంప్రదాయ పద్ధతిలో వీరి పెళ్లి జరిగింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.