యాప్నగరం

Tammineni veerabhadram సోదరుడు దారుణహత్య.. ఖమ్మం జిల్లాలో కలకలం

ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య దారుణహత్యకు గురయ్యాడు. మృతుడు సీపీఎం నేత తమ్మినేని వీరభద్రానికి స్వయానా సోదరుడు.

Authored byవీరేష్ బిళ్ళ | Samayam Telugu 15 Aug 2022, 1:26 pm
స్వాతంత్య్ర దినోత్సవం వేళ ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తెల్లారుపల్లి గ్రామంలో టీఆర్‌ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్యను దుండగులు కత్తులు, కొడవళ్లతో అతి కిరాతకంగా హత్య చేశారు. తెలంగాణ సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు కృష్ణయ్య సోదరుడు అవుతాడు. కొంతకాలం క్రితం సీపీఎం నుంచి బయటకు వచ్చేసిన కృష్ణయ్య టీఆర్ఎస్‌లో చేరాడు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ముఖ్య అనుచరుడిగా కొనసాగుతున్నారు.
Samayam Telugu Image


అయితే తనకు సీపీఎం నేతల నుంచి ప్రాణహాని ఉందని గతంలో పలుమార్లు ఆరోపిస్తూ.. తనకు రక్షణ కల్పించాలని కృష్ణయ్య చాలాసార్లు పోలీసులను వేడుకున్నాడు. అయితే అందరూ పంద్రాగస్టు వేడుకల్లో నిమగ్నమైన వేళ గుర్తుతెలియని వ్యక్తులు కృష్ణయ్యను అతికిరాతకంగా హత్య చేయడం కలకలం రేపుతోంది. ఈ ఘటనతో ఉమ్మడి ఖమ్మం టీఆర్ఎస్ నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ హత్యకు రాజకీయ కక్షలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రచయిత గురించి
వీరేష్ బిళ్ళ
వీరేశ్ బిల్లా సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ రాజకీయ, సినీ రంగాలకు చెందిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. దీంతో పాటు వీడియో టీమ్‌కు సేవలు అందిస్తున్నారు. తనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయాలు, క్రీడలు, సినిమా రంగాలకు సంబంధించి ఆర్టికల్స్ రాశారు... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.