యాప్నగరం

Bhadradri Kothagudem: స్ట్రెచర్ లేకపోవడంతో భార్యను భుజాలపై తీసుకెళ్లిన వృద్ధుడు.. ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వాకం

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఎంజీఎం ప్రభుత్వ ఆస్పత్రిలో స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడంతో తన భార్యను ఓ భర్త భూజాలపై వేసుకుని తీసుకెళ్లాడు.

Authored byవెంకట్రావు లేళ్ల | Samayam Telugu 13 May 2023, 8:50 am

ప్రధానాంశాలు:

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రి నిర్వాకం
  • స్ట్రెచర్ ఇవ్వని ఆస్పత్రి సిబ్బంది
  • భార్యను భూజాలపై ఎత్తుకుని వెళ్లిన భర్త
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu hospital
ఆస్పత్రి
Bhadradri Kothagudem: స్ట్రెచర్ ఇవ్వకపోవడంతో కుటుంబసభ్యులు ప్రభుత్వ ఆస్పత్రిలో నేలపై రోగిని ఈడ్చుకెళ్లిన ఘటన ఇటీవల తెలంగాణలో వివాదాస్పదంగా మారింది. ఆస్పత్రి సిబ్బంది తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా అలాంటి ఘటన మరొకటి రాష్ట్రంలో జరగడం మరింత వివాదానికి దారి తీస్తోంది. స్ట్రెచర్ ఇవ్వకపోవడంతో భార్యను ఆమె భర్తే వీపుకెక్కించుకుని మోసుకుంటూ వెళ్లాడు. ఈ ఘటన అందరినీ కలిచివేస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన లక్ష్మి అనే వృద్ధురాలికి నెల కిందట ఎంజీఎంలో డాక్టర్లు ఆపరేషన్ చేసి అరిపాదం తొలగించారు. ఆ తర్వాత నెల తర్వాత వచ్చి మళ్లీ చెకప్ చేయించుకోవాలని సూచించారు. దీంతో శుక్రవారం భార్యను తీసుకుని భర్త హాస్పిటల్‌కు వచ్చాడు. అయితే డాక్టర్ అందుబాటులో లేరని, రేపు రావాలని సిబ్బంది సూచించారు. అయితే కనీసం స్ట్రెచర్ కూడా ఇవ్వకపోవడంతో భార్యను భర్త భుజాలపైకి ఎక్కించుకొని బయటికి తీసుకొచ్చారు. ఈ సమయంలో అక్కడ ఉన్న కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల తీరుపై పులువురు విమర్శలు కురిపిస్తున్నారు.

కనీసం వయస్సును దృష్టిలో పెట్టుకునైనా హాస్పిటల్ సిబ్బంది స్ట్రెచర్ ఇవ్వకపోవడంపై మండిపడుతున్నారు. అయితే ఎంజీఎం హాస్పిటల్‌లో ఇలాంటి ఘటనలు సర్వసాధారణంగా మారాయని, ఉన్నతాధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటేనే పరిస్థితులు మెరుగుపడుతాయని రోగులు, ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. వివాదంగా మారడంతో ఈ వీడియోపై ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ స్పందించారు. ఎంజీఎంని అభాసుపాలు చేసేందుకు ఈ వీడియో తీశారనిపిస్తుందని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని ఎంజీఎం సూపరింటెండెంట్ స్పష్టం చేశారు.

  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
వెంకట్రావు లేళ్ల
వెంకట్రావు లేళ్ల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తాజా వార్తలు, పొలిటికల్ అప్‌డేట్స్, పొలిటికల్ అనాలసిస్ అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.