యాప్నగరం

పండుగ వేళ విషాదం.. ఆలయంలోకి కారు దూసుకెళ్లడంతో ఇద్దరు చిన్నారుల మృతి

Khammam: ఖమ్మం జిల్లాలో శ్రీరామనవమి పర్వదినానే విషాదం చోటు చేసుకుంది. రాత్రి వేళ ఆలయంలో భక్తులు భజన చేస్తుండగా ఓ కారు వారిపైకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

Samayam Telugu 11 Apr 2022, 8:34 am
ఖమ్మం జిల్లాలో శ్రీరామనవమి పర్వదినానే విషాదం చోటు చేసుకుంది. రాత్రి వేళ ఆలయంలో భక్తులు భజన చేస్తుండగా ఓ కారు వారిపైకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


వివరాల్లోకి వెళ్తే.. కొణిజర్ల మండలం పల్లిపాడు గ్రామంలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొని బొలేరో వాహనం ఆంజనేయస్వామి దేవాలయంలోకి దూసుకుపోయింది. ఈ క్రమంలోనే గుడిలో శ్రీరామనవమి వేడుకల సందర్భంగా భజన చేస్తున్న ముగ్గురు చిన్నారులను ఢీకొంది. దీంతో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో చిన్నారికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారు ప్రమాదంలో కొణిజర్ల మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారని.. వారిని ఖమ్మం ఆసుపత్రికి తరలిస్తుండగా.. ఇద్దరు అక్కాచెల్లెళ్లు పగడాల దేదీప్య (9), సహస్ర (7) మార్గమధ్యలోనే మరణించారన్నారు. మరో చిన్నారి అలేఖ్యను ఆస్పత్రిలో చేర్చారని.. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉందన్నారు. బొలెరో వాహనంలో ఉన్న వ్యక్తితో పాటు మరో స్థానికుడికి గాయాలయ్యాయని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.