యాప్నగరం

ఏపీలో గల్లంతై.. తెలంగాణలో తేలిన యువతి.. షాకింగ్

పశ్చిమ గోదావరి జిల్లాలో బైక్‌పై నుంచి కిందపడిన యువతి.. నీటిలో కొట్టుకుపోయింది. ఆలయ దర్శనానికి వెళ్లిన ఆమె వరద నీటిలో చిక్కుకుంది. తెలంగాణలో ఆమె మృతదేహం లభ్యమైంది.

Samayam Telugu 7 Sep 2021, 5:07 pm
తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షం కారణంగా వాగులూ, వంకలూ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఏపీలోని కోస్తా జిల్లాలతో పాటు ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. పలుచోట్ల ప్రజలు వరదనీటిలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతున్నారు. ఓ యువతి అన్నతో కలసి దేవుడిని దర్శించుకునేందుకు వెళ్లి వరద నీటిలో చిక్కుకుని మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో గల్లంతైన యువతి తెలంగాణలో శవమై తేలింది.
Samayam Telugu అన్న బైక్‌పై యువతి
bike


పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం పరిధిలోని అటవీ ప్రాంతంలో కొలువైవున్న గుబ్బలమంగమ్మ ఆలయాన్ని దర్శించుకునేందుకు అన్నతో కలసి వెళ్లిందో యువతి. ఆలయ సమీపంలోని ఉధృతంగా ప్రవహిస్తున్న ఎర్ర ఎక్కుడు కాల్వను దాటించే క్రమంలో యువతి అదుపుతప్పి పడిపోయింది. కాల్వలో నీటి ప్రవాహం వేగంగా ఉండడంతో ఆమె క్షణాల్లో గల్లంతైంది. ఆమెతో ఉన్న అన్న, మరో ఇద్దరు స్నేహితులు త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు.

యువతి గల్లంతైన విషయం తెలుసుకున్న ఆలయ కమిటీ, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వరద ఉధృతిలో కొట్టుకుపోయిన యువతి ఆచూకీ తెలంగాణలో లభ్యమైంది. అశ్వారావుపేట మండలం కన్నాయిగూడెం పంచాయతీ పరిధిలోని కంట్లం వద్ద వాగులో యువతి మృతదేహం లభ్యమైంది. కాల్వ ప్రవాహానికి యువతి మృతదేహం ఏపీ నుంచి తెలంగాణ పరిధిలోకి కొట్టుకువచ్చినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.