యాప్నగరం

ప్రియురాలితో పోలీస్ రాసలీలలు.. సడెన్‌గా భార్య ఎంట్రీ.. దిమ్మతిరిగే షాక్

భర్త తన ప్రియురాలితో రహస్యంగా కాపురం పెట్టిన విషయం తెలుసుకుంది భార్య. అడ్రస్ వెతికి పట్టుకుని మరీ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని భర్తకి బడితెపూజ చేసింది.

Samayam Telugu 5 Aug 2021, 3:12 pm
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని మోసగించి మరో యువతితో రాసలీలలు సాగిస్తున్న పోలీస్ హెడ్ కానిస్టేబుల్ బండారం బట్టబయలైంది. ప్రియురాలితో కాపురం చేస్తున్న భర్తని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య అపరకాళిక అవతారమెత్తింది. మోసం చేసి మరో మహిళతో రాసలీలలు సాగిస్తున్న భర్తని నడిరోడ్డుపై చెప్పుతో కొట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఈ ఘటన జరిగింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
affair


ఆరో బెటాలియన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న గడ్డం రాజేష్ కొన్నేళ్ల కిందట స్వప్నని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల కొద్దికాలంగా మరో యువతితో ప్రేమాయణం నడుపుతున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని మోసం చేస్తూ ఆమెతో రాసలీలలు సాగించాడు. పాల్వంచ‌లో రహస్య కాపురం పెట్టాడు. అనుమానం వచ్చిన భార్య ఆరా తీసి అడ్రస్ వెతికి పట్టుకుంది. భర్త, అతని ప్రియురాలిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని బడితెపూజ చేసింది. నడిరోడ్డుపై చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పింది. తనను మోసం చేసి మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.