యాప్నగరం

ఇంటికి కాపలాగా ఇద్దరు వాచ్‌మెన్లు.. అయినా రూ.2 లక్షల నగదు, 3 కిలోల వెండి చోరీ

Mahabubnagar: మహబూబ్‌నగర్ జిల్లా మస్తీపూర్ గ్రామంలో శనివారం రాత్రి చోరీ జరిగింది. గ్రామానికి చెందిన ఓ వ్యాపారవేత్త ఇంట్లో చోరీకి పాల్పడిన దుండగులు రూ. 2 లక్షల నగదు, 3 కేజీల వెండి ఎత్తుకెళ్లిపోయారు. ఇంటికి ఇద్దరు వాచ్‌మెన్లు ఉన్నా.. చోరీ జరగటం పలు అనుమానాలకు తావిస్తోంది.

Authored byసందీప్ పూల | Samayam Telugu 13 Mar 2023, 11:46 am

ప్రధానాంశాలు:

  • ఇద్దరు వాచ్‌మెన్లు ఉన్నా ఇంట్లో చోరీ
  • రూ. 2 లక్షల నగదు, 3 కేజీల వెండి అపహరణ
  • వాచ్‌మెన్ల పాత్రపై అనుమానాలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu mastipur theft
మస్తీపూర్‌లో దొంగతనం
Mahabubnagar: ఆ ఇంటికి కాపలాగా ఇద్దరు వాచ్‌మెన్లు ఉన్నారు. అయినా ఆ ఇంట్లో దొంగతనం జరిగింది. ఏకంగా రూ. 2 లక్షల నగదు, 3 కేజీల వెండి అపహరణకు గురయ్యాయి. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా అమరచింత మండలం మస్తీపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మస్తీపూర్ గ్రామానికి చెందిన కవితా రెడ్డి బిజినెస్ పనుల నిమిత్తం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఆమెకు గ్రామంలో సొంత ఇంటితో పాటు వ్యవసాయ భూములు ఉన్నాయి. తీరక సమయాల్లో స్వగ్రామానికి వచ్చి రెండు మూడు రోజులు ఉండి వెళ్తుంటారు.
గ్రామంలో ఇంటి వద్ద ఇద్దరు వాచ్‌మెన్లను కాపలగా నియమించుకున్నారు. ఈ క్రమంలో శనివారం (ఈనెల 11న) గుర్తు తెలియని వ్యక్తులు వాచ్‌మెన్ల కళ్లుగప్పి ఇంట్లోకి ప్రవేశించారు. బీరువా పగులగొట్టి అందులో ఉన్న రూ. 2 లక్షల నగదు, 3 కేజీల వెండి వస్తువులతో పాటు ఖరీదైన చీరలను ఎత్తుకెళ్లిపోయారు. తెల్లవారుజామున గది తలపులు తెరిచి ఉండటాన్ని గమనించిన వాచ్‌మెన్లు యజమాని కవితారెడ్డికి ఫోన్ చేసి సమాచారం అందించారు. ఇంటికి చేరుకున్న ఆమె.. జరిగిన ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. క్లూస్ టీం ద్వారా వివరాలు సేకరించారు.

ఇద్దరు వాచ్‌మెన్లు ఉన్నా.. ఇంట్లో చోరీ జరగటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చోరీలో వాచ్‌మెన్ల పాత్రపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు.

రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.