యాప్నగరం

కేసీఆర్ సర్కారుకు పోయే కాలం వచ్చింది: ఈటల

Etela Rajender: ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఈటల రాజేందర్ మరోసారి ఫైర్ అయ్యారు. కేసీఆర్ సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయని వ్యాఖ్యానించారు. ప్రజలు ఆశీర్వదిస్తే.. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. దేవరకద్ర నియోజకవర్గంలో పల్లె గోస-బీజేపీ భరోసా కార్యక్రమం నిర్వహించారు. దీంట్లో పాల్గొన్న ఈటల.. కేసీఆర్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 9 Aug 2022, 3:30 pm

ప్రధానాంశాలు:

  • దేవరకద్రలో పల్లె గోస - బీజేపీ భరోసా
  • పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్
  • కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని కామెంట్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Etela Rajender
మాట్లాడుతున్న ఈటల రాజేందర్
Etela Rajender: బీజేపీ ఒత్తిడి వల్లనే 10 లక్షల పింఛన్లు పెంచారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో.. పల్లె గోస - బీజేపీ భరోసా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈటల ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ఎవరినీ కలవరని.. అలాంటి సీఎం మనకు కావాలా అని తెలంగాణ (Telangana) ప్రజలు అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రభుత్వానికి పోయే కాలం వచ్చిందని స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఎగురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మూడున్నర సంవత్సరాలుగా కేసీఆర్ (CM KCR) ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఈటల రాజేందర్ ఆరోపించారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. అరచేతిలో బెల్లం పెట్టీ.. మోచేతితో నాకించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 57 ఏళ్లకు పింఛన్లు ఇస్తానని ఇవ్వలేదన్నారు. మూడేళ్లుగా 65 సంవత్సరాలు దాటిన వారికి పింఛన్ ఇవ్వడం లేదని ఆరోపించారు. బీజేపీ (BJP) బైక్ ర్యాలీలు, పాదయాత్రలు చేపట్టిన తరువాత.. ప్రజా క్షేత్రంలో తప్పించుకోలేకనే పంద్రాగస్టు నుంచి 10 లక్షల పింఛన్లు ఇస్తానని ప్రకటించారని వ్యాఖ్యానించారు.

కేసీఆర్ మాటలు కోటలు దాటుతాయి కానీ.. కాళ్లు తంగెల్లు దాటవని ఈటల రాజేందర్ (Etela Rajender) ఎద్దేవా చేశారు. ప్రజలు ఆశీర్వదిస్తే రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వంలో అన్నీ సమస్యలు పరిష్కారం అవుతాయని వ్యాఖ్యానించారు.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.