యాప్నగరం

నల్లమల ఫారెస్ట్‌లో గుప్తనిధుల తవ్వకాలు... రాజకీయ నాయకుల అండదండలు?

నాగర్ కర్నూలు జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. రాజకీయ నాయకుల పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Samayam Telugu 25 Feb 2021, 10:53 am
నల్లమల అటవీ ప్రాంతం అనేక వనప్రాణులు, ప్రముఖ పుణ్యక్షేత్రాలకు నిలయం. అక్కడ నిధులు, నిక్షేపాలు కూడా ఉన్నాయని ఎన్నో ఏళ్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో అప్పుడప్పుడు కొందరు వ్యక్తులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపేందుకు యత్నిస్తూనే ఉంటారు. తాజాగా నల్లమల ఫారెస్ట్‌లో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయన్న ప్రచారం ఊపందుకుంది. టూరిజం పేరుతో అడవిలోకి వస్తున్న కొందరు గుట్టుగా తవ్వకాలు జరుపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Samayam Telugu Image


Also Read: హైదరాబాద్: ఇద్దరు అమ్మాయిలతో ఏకాంతసేవ.. అడ్డంగా బుక్కైన డాక్టర్, రూ.39లక్షల హుష్‌కాకి

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామ సమీపంలో నల్లమల అడవిలో ప్రతాపరుద్రుడి కోట ఉంది. 14వ శతాబ్ధంలో నిర్మించిన ఈ ప్రసిద్ధ పురాతనమైన ఈ కట్టడం కృష్ణా నది పొడవునా దాదాపు 300 కిలోమీటర్ల మేర ఉంటుంది. అక్కడికి వెళ్లాలంటే సుమారు రెండు కిలోమీటర్లు నడవాలి. అలాంటి ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చాలన్న ఉద్దేశంతో అధికారులు ఎంతో శ్రమకోర్చి రోడ్డు మార్గాన్ని ఏర్పాటుచేశారు. ఈ నేపథ్యంలోనే కొందరు అక్రమార్కులు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలోకి గుట్టుగా చొరబడి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

Also Read: జూబ్లీహిల్స్: అర్ధరాత్రి సెల్‌ఫోన్‌ లాక్కున్న దొంగ.. దిమ్మతిరిగే షాకిచ్చిన మహిళ, ఇలా ఊహించి ఉండరు

టూరిజం డెవలప్‌మెంట్ పేరుతో ఎవరెవరో చొరబడి గుప్తనిధుల కోసం అడవిని నాశనం చేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. తాము పశువుల మేత కోసం అడవిలోకి వెళ్తేనే ఫారెస్ట్ అధికారులు కేసులు నమోదు చేస్తారని, అలాంటిది గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపితే ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక రాజకీయ నాయకుల హస్తం ఉన్నందువల్లే అధికారులు పట్టించుకోవడం విమర్శలు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.