యాప్నగరం

భూమిలో బంగారం.. పునాదుల కోసం తవ్వుతుండగా వెయ్యి నాణాలు

ఇంటి నిర్మానం కోసం పునాది తవ్వకాలు చేపట్టారు. దీంతో పునాదులు తవ్వుతుండగా కూలీలకు బంగారు నాణాలు లభ్యం అయ్యాయి. దీంతో వాటిని యజమానికి తెలియకుండా పంచుకున్నారు.

Samayam Telugu 28 Jul 2021, 11:20 am
భూమిలో బంగారు నాణాలు లభ్యం అయ్యాయి. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగింది. ఇంటి పునాదుల కోసం మానపాడు మండల కేంద్రంలో భూమిని తవ్వారు. ఇంతలో భూమిలోపల బంగార నాణాల్ని గుర్తించారు కూలీలు. దీంతో ఇంటి యజమానికి తెలియకుండా వారే దొరికిన బంగారాన్ని పంచకున్నారు. అయితే పంపకాల్లో వివాాాదాలు తలెత్తాయి.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


పునాదుల తవ్వకాల్లో సుమారు 100కు పైగా నాణ్యాలు లభ్యఅయ్యాయి. నెల రోజుల క్రితం ఓ పాత ఇంటి గోడలు తొలగిస్తుండగా బంగారు నాణాలు, వడ్డాణం బయటపడ్డాయి. దీంతో కూలీలు వెంటనే వాటిని
ఇంటి యజమాని కి తెలియకుండా పంచుకున్నారు. అయితే ఇంటి యజమానికి ఈ విషయం తెలవడంతో బయటకు పొక్కింది.దీంతో అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పంపకాల్లో తేడా కారణంగా ఈ వ్యహారం బయటపడంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు జరిగిన ఘటనపై ఆరా తీస్తున్నారు. పలువురు కూలీలను అదుపులోకి విచారిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.