యాప్నగరం

వివాహితతో ఎస్ఐ రాసలీలలు.. సడెన్ ఎంట్రీ ఇచ్చిన భర్త, చివరికి

వివాహితతో అఫైర్ నడుపుతున్న ఎస్ఐ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఇద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న మహిళ భర్త ఎస్ఐని చావబాదాడు. ఉన్నతాధికారులు ఎస్ఐని సస్పెండ్ చేశారు.

Samayam Telugu 26 Nov 2021, 1:48 pm

ప్రధానాంశాలు:

  • వివాహితతో ఎస్ఐ రాసలీలలు
  • భర్తలేని సమయంలో ఇంటికొచ్చి కామక్రీడలు
  • రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదిన భర్త
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Image
వనపర్తి జిల్లాలో కీచక ఎస్ఐ బాగోతం బట్టబయలైంది. ఓ వివాహితను లొంగదీసుకుని ఆమెతో అక్రమ సంబంధం నడుపుతున్న ఎస్ఐని ఆమె భర్త రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదాడు. వివరాల్లోకి వెళ్తే... వనపర్తి రూరల్ ఎస్ఐగా పనిచేస్తున్న షేక్ షఫీ కొంతకాలంగా కొత్తకోటకు చెందిన వివాహితతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. తరుచూ ఆమెతో ఫోన్లో మాట్లాడుతూ.. భర్తలేని సమయంలో ఇంటికి వెళ్లి రాసలీలలు కొనసాగిస్తున్నాడు.
స్థానికులు, స్నేహితుల సాయంతో ఈ విషయం తెలుసుకున్న భర్త ఇద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవాలని స్కెచ్ వేశాడు. ఈ నెల 18న బయటకు వెళ్తున్నట్లు భార్యకు చెప్పి సమీపంలోనే కాపుకాశాడు. దీంతో ఆ మహిళ ఎస్‌ఐకి ఫోన్ చేయగా అతడు క్షణాల్లోనే ప్రియురాలి ఇంట్లో వాలిపోయాడు. ఇద్దరూ రాసలీలల్లో మునిగితేలుతుండగా భర్త స్నేహితుల సాయంతో వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఆవేశంతో రగిలిపోయిన భర్త స్నేహితులతో కలిసి ఎస్ఐని విచక్షణా రహితంగా చితకబాదాడు. అడ్డొచ్చిన భార్యను కూడా చావబాదాడు.

తనను వదిలేయాలని ఎస్ఐ ప్రాధేయపడాలని వినిపించకుండా వారంతా చితకబాదడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. దీనిపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఎస్ఐని కాపాడి వనపర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డాక్టర్ల సలహా మేరకు అతడిని హైదరాబాద్‌కు తరలించారు. అయితే ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు ఎస్ఐ‌ షేక్ షఫీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. వక్రబుద్ది చూపిన ఖాకీకి తగిన శాస్తి జరిగిందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.