యాప్నగరం

Mahabubnagar: పటాకులు పేల్చాడని టీఆర్ఎస్ నేతల దాడి.. చోద్యం చూసిన పోలీసులు

Mahabubnagar: మహబూబ్‌నగర్ జిల్లాలో దసరా వేడుకల్లో టీఆర్ఎస్ నాయకులు వీరంగం సృష్టించారు. వేదిక మీదే బాణాసంచా నిర్వహకుడిపై మూకుమ్మడి దాడి చేశారు. దసరా వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్.. ప్రసంగించే సమయంలోనే బాణాసంచా కాల్చటంతో.. వివాదం మొదలైంది. దీంతో బాణాసంచా నిర్వాహకున్ని వేదికపైకి పిలిచి మరి అతనిపై కార్యకర్తలంతా మూకుమ్మడి దాడి చేశారు.

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 6 Oct 2022, 12:18 pm
Mahabubnagar: మహబూబ్‌నగర్ జిల్లాలో దసరా వేడుక (Dussehra Celebrations) ల్లో టీఆర్ఎస్ నేతలు వీరంగం ప్రదర్శించారు. జిల్లా ఉన్నతాధికారులు, పోలీసులు ఉన్న వేదికపైనే నేతలు ఓ వ్యక్తిపై దాడి పాల్పడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ మైదానంలో దసరా వేడుకలు ఏర్పాటు చేశారు. ఏటా.. దసరా వేడుకలు ఘనంగా నిర్వహించడంతో పాటు చివర్లో పెద్దఎత్తున బాణాసంచా (Firecrackers) కాల్చడం ఆనవాయితీగా వస్తుంది. అయితే.. ఈ సారి వేడుకలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) హాజరయ్యారు. కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రసంగించారు. అయితే.. మంత్రి ప్రసంగిస్తోన్న సమయంలోనే... బాణాసంచా కాల్చడం మొదలు పెట్టారు. ఆ పటాసుల చప్పుళ్లతో ప్రసంగానికి అంతరాయం ఏర్పడింది. దీంతో అసహనాన్ని గురైన మంత్రి.. వేదికపై ఉన్న మంత్రి అసహనాన్ని గురయ్యారు. దసరా నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఊరుకోకుండా వేదికపై ఉన్న జేపీఎన్సీ కళాశాల అధినేత, టీఆర్ఎస్ నాయకుడు రవికుమార్... బాణాసంచా నిర్వహకుడు హరినాథ్‌ను వేదికపైకి రావాలని హెచ్చరించాడు. హరినాథ్ వేదికపైకి రాగానే.. అతనిపై టీఆర్ఎస్ నేతలు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు.
Samayam Telugu trs
బాణాసంచా


మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతున్న సమయంలోనే వర్షం పడటం వల్ల.. ప్రాంగణమంతా కొంత హడావుడిగా మారిపోయింది. ఈ హడావుడిలో నిర్వహకులకు సమన్వయం లోపించింది. ఫలితంగా.. అదే సమయంలో బాణాసంచా కాల్చరు. ఈ ఘటన తీవ్ర గందరగోళానికి దారి తీసింది. సాక్షాత్తు జిల్లా ఉన్నతాధికారులు ఉన్న వేదికపైనే నేతలు ఒక్కసారిగా బాణాసంచా నిర్వాహకుడు హరినాథ్‌పై దాడి జరిగింది. వేదికపైనే పోలీసులు ఉన్నా ఏమాత్రం పట్టించుకోకుడా చోద్యం చూస్తూ నిలబడిపోయారు. దీంతో పోలీసులపై స్థానికులు విమర్శల వర్షం కురిపించారు. దాడి మొత్తం అయిపోయాక.. తీరిగ్గా వచ్చి బాణాసంచా నిర్వాహకునికి సర్ధి చెప్పి పక్కకు తీసుకువెళ్లారు.
రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.