యాప్నగరం

వెనక్కి తిరిగితే రాళ్లతో కొట్టి చంపండని గతంలో చెప్పా.. హాలియా సభలో కేసీఆర్

Halia Nalgonda: నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం సాయంత్రం నల్గొండ జిల్లా హాలియాలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు.

Samayam Telugu 14 Apr 2021, 7:38 pm
నోముల నర్సింహయ్య వారసుడిగా ఆయన కుమారుడు నోముల నాగార్జున సాగర్ ప్రజలకు సేవ చేస్తారని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఆయన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించాలని అన్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం సాయంత్రం నల్గొండ జిల్లా హాలియాలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు.
Samayam Telugu కేసీఆర్ (ఫైల్ ఫోటో)
kcr in nalgonda


‘‘ఈ సభ జరగకూడదని కొంత మంది చెయ్యని ప్రయత్నం లేదు. ఇది ప్రజాస్వామ్యంలో తలాతోక లేని వ్యవహారం. వాస్తవాలన్నీ మీ కళ్ల ముందున్నయ్. మీకన్ని విషయాలు అర్థమయ్యాయి. ఎవరు గెలిస్తే మంచిదో ఎవరు గెలిస్తే నియోజకవర్గం మంచిగా అవుతుందో మీకు అర్థమై ఉంటుంది. నోముల నర్సింహయ్య ఎన్నో ఉద్యమాలు చేసిన వ్యక్తి తనయుడు, విద్యావంతుడైన నోముల భగత్‌ను నిలబెట్టాం. ఇక్కడ భగత్ గాలి బాగానే ఉందని నాకర్థమైంది. ఈ గాలి 17వ తారీకుదాకా ఉండాలి. భగత్‌కు ఓట్లు ఎట్లా దుంకుతాయో నెల్లికలు నీళ్లు కూడా దుంకుతాయి.’’

‘‘గత పరిపాలకులు హామీ ఇచ్చి వదిలిపెట్టిన పనులు పూర్తి చేయకపోతే రాజీనామా చేస్తానని మంత్రి గతంలో చెప్పారు. ఎక్కడ బిచ్చమెత్తైనా సరే ఎత్తి పోతల పనులను పూర్తి చేస్తాం. జానారెడ్డి 30 ఏళ్లుగా ఉన్నా ఒక్క డిగ్రీ కాలేజీ కూడా రాలేదు. నర్సింహయ్య కోరిన వెంటనే నేను రెండు డిగ్రీ కాలేజీలు ఇచ్చా. నాకు సీఎం పదవి జానారెడ్డి పెట్టిన భిక్ష అని మొన్న ఒకాయన అన్నారు. నాకు భిక్ష పెట్టింది ప్రజలు. నేను వెనక్కు తిరిగితే రాళ్లతో కొట్టి చంపండని గతంలో చెప్పా. కాంగ్రెస్ చరిత్ర పదవుల కోసం తెలంగాణను వదిలిపెట్టింది. తెలంగాణ కోసం పదవులను వదిలిపెట్టింది టీఆర్ఎస్. ఇదంతా మీ కళ్ల ముందు జరిగిన చరిత్ర. మీరు ఓటు వేసే ముందు ఇదంతా ఆలోచన చేయాలి. పచ్చ జెండా వాడు రూ.75 పింఛను ఇచ్చాడు. కాంగ్రెసోళ్లు రూ.200 ఇచ్చారు. దాన్ని రెండు వందల రెట్లు చేసి రూ.2 వేలకు పైగా ఇస్తున్నాం.’’ అని కేసీఆర్ అన్నారు.

మీకు సేవ చేసుకుంటూ ఉంటా: నోముల భగత్
‘‘మా నాన్న గారు కేసీఆర్‌పై ఉన్న నమ్మకంతో నియోజకవర్గ ప్రజలకు ఏ హామీలిచ్చారో అవన్నీ నేను నెరవేస్తున్నా. ఏప్రిల్ 17న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. మీ అందరికీ ఓ కొడుకులా, సోదరుడిలా మీకు సేవ చేసుకొని ఉంటా’’ అని నోముల భగత్ మాట్లాడారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.