యాప్నగరం

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేకి షాక్.. కోదాడ ఎమ్మెల్యే రాజీనామా.! డిమాండ్

కేసీఆర్ అట్టహాసంగా ప్రకటించిన పథకం సొంత పార్టీ ఎమ్మెల్యేలకే షాకిస్తోంది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలంటూ ఆందోళనలు, ర్యాలీలు చేస్తున్నారు. తాజాగా సూర్యాపేట జిల్లాలోని ఓ ఎమ్మెల్యేకి చేదు అనుభవం ఎదురైంది.

Samayam Telugu 1 Aug 2021, 5:12 pm
కేసీఆర్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టనున్న దళిత బంధు పథకం తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. టీఆర్‌ఎస్ అధినేత నిర్ణయం సొంత పార్టీ ఎమ్మెల్యేలకే ఊహించని షాకిస్తోంది. ఉప ఎన్నికలు వస్తేనే కొత్త పథకాలు వస్తామని.. తమకి కూడా లబ్ధి కలుగుతుందంటూ పలుచోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తక్షణమే రాజీనామాలు చేయాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. ఉప ఎన్నికలు వస్తే తమ నియోజకవర్గానికి కూడా నిధులు వస్తాయని.. తద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజా, దళిత సంఘాలు ఆందోళనలకు దిగుతున్నాయి.
Samayam Telugu బొల్లం మల్లయ్య యాదవ్
bollam mallaiah


తాజాగా కోదాడ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యకి దళిత బంధు షాక్ తగిలింది. తమ ఎమ్మెల్యే రాజీనామా చేయాలంటూ దళిత సంఘాల నేతలు ఆందోళన బాట పట్టారు. ఎమ్మెల్యే రాజీనామా చేస్తే తాము కూడా దళిత బంధు ద్వారా లబ్ధి పొందుతామంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. దళిత సంఘాలకు సంఘీభావంగా బీజేపీ నేతలు ర్యాలీ చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. తక్షణమే రాజీనామా చేసి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలంటూ వినూత్న డిమాండ్ తెరపైకి తీసుకురావడం గమనార్హం.

హుజూరాబాద్‌లో దళిత బంధు పథకం పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయంతో పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. ఎమ్మెల్యేలు తమ ప్రాంత అభివృద్ధికి నిధులు తీసుకురావాలని అడిగేందుకు బదులు రాజీనామాలు చేయాలని డిమాండ్లు చేయడం చర్చనీయాంశంగా మారింది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.