యాప్నగరం

RRR : కోదాడలో ‘ఆర్ఆర్ఆర్’ ఫ్లెక్సీ వివాదం.. పెట్రోల్ పోసుకొని తారక్ అభిమాని ఆత్మహత్యాయత్నం

RRR Movie: ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదల నేపథ్యంలో థియేటర్ల వద్ద జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ అభిమానుల సందడి కనిపిస్తోంది. థియేటర్ల ముందు భారీ ఎత్తున పోస్టర్లు ఏర్పాట్లు చేసే పనుల్లో అభిమానులంతా బిజీగా ఉన్నారు.. అయితే ఫ్లెక్సీల ఏర్పాటు విషయమై ఏర్పడిన గొడవతో ఓ జూనియర్ ఎన్టీఆర్ అభిమాని ఆత్మహత్యకు యత్నించాడు.. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది.

Samayam Telugu 22 Mar 2022, 9:03 am
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన పాన్‌ ఇండియా మల్టీస్టారర్‌ చిత్రం ఆర్ఆర్ఆర్.. ఈ చిత్రం మరో మూడ్రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.. ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదల నేపథ్యంలో థియేటర్ల వద్ద జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ అభిమానుల సందడి కనిపిస్తోంది. థియేటర్ల ముందు భారీ ఎత్తున పోస్టర్లు ఏర్పాట్లు చేసే పనుల్లో అభిమానులంతా బిజీ బిజీగా ఉన్నారు.
Samayam Telugu RRR


అయితే కోదాడలోని శ్రీనివాస థియేటర్‌ ఎదుట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వివాదం ఓ యువకుడి ఆత్మహత్యాయత్నానికి దారితీసింది.. థియేటర్‌ ఎదుట ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే సందర్భంలో ఎన్టీఆర్‌ అభిమానుల మధ్య ఘర్షణ నెలకొంది. తమ ఫ్లెక్సీ ముందు కనిపించాలంటూ అభిమానులు గొడవకు దిగారు. ఈ క్రమంలో పట్టణానికి చెందిన ఎన్టీఆర్‌ అభిమాని మైకు సైదులు రోడ్డుపై బైఠాయించి ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు.

ఇది గమనించిన వెంటనే సహచర అభిమానులు అతడి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు థియేటర్‌ వద్దకు చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఘర్షణకు దిగిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో ఆ థియేటర్ వద్ద ఉద్రికత్త చోటు చేసుకుంది..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.