యాప్నగరం

Munugode: జగదీశ్ రెడ్డికి కోమటరెడ్డి సవాల్.. నిరూపిస్తే రాజకీయ సన్యాసమే

మునుగోడు వేదికగా తెలంగాణ రాజకీయం వేడెక్కుతోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీతో పాటు అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. తాజాగా మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కోమటరెడ్డి.. తాను కాంట్రాక్టుల కోసమే బీజేపీలో చేరుతున్నట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని.. ఒకవేళ నిరూపించలేకపోతే మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ సవాల్ విసిరారు.

Edited byరావు | Samayam Telugu 16 Aug 2022, 9:34 am

ప్రధానాంశాలు:

  • సొంత ఇల్లు కూడా లేని జగదీశ్ రెడ్డికి వేల కోట్లు ఎక్కడివి
  • నేను కాంట్రాక్టుల కోసమే బీజేపీలో చేరుతున్నట్లు నిరూపిస్తారా
  • జగదీశ్ ఆస్తుల చిట్టా బయటపెడితే రాజీనామా చేస్తావా
  • మంత్రికి సవాల్ విసిరిన కోమటరెడ్డి రాజగోపాల్ రెడ్డి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Jagadish Reddy, Rajgopal Reddy
మంత్రి జగదీశ్ రెడ్డి, కోమటరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మునుగోడు వేదికగా తెలంగాణ రాజకీయం వేడెక్కుతోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీతో పాటు అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. తాజాగా మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కోమటరెడ్డి.. తాను కాంట్రాక్టుల కోసమే బీజేపీలో చేరుతున్నట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని.. ఒకవేళ నిరూపించలేకపోతే మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ సవాల్ విసిరారు.
చౌటుప్పల్‌లో బీజేపీ కార్యకర్తలతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయంగా తనను ఎదుర్కోలేకే జగదీశ్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. హత్య కేసులో జైలుకు వెళ్లొచ్చిన జగదీశ్ రెడ్డికి తనను విమర్శించే స్థాయి లేదని.. మంత్రికి వెయ్యి కోట్ల ఆస్తి ఎక్కడ నుంచి వచ్చిందంటూ కోమటరెడ్డి ప్రశ్నించారు. 2014లో సొంత ఇల్లు కూడా లేని మంత్రి ఆస్తులు.. ఏడేళ్లలో వేల కోట్లకు ఎలా పెరిగాయని అడిగారు.

జగదీశ్ రెడ్డి నీ ఆస్తుల చిట్టా బయట పెడితే పదవికి రాజీనామా చేస్తావా అని కోమటరెడ్డి సవాల్ విసిరారు. మునుగోడులో తన రాజీనామా తర్వాతే అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని.. అసెంబ్లీలో మూడేళ్లు పోరాడినా ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మునుగోడు ప్రాంత ప్రాజెక్టులను పట్టించుకోలేదని.. మనుగోడు ప్రజల ఆత్మ గౌరవం కోసమే తాను రాజీనామా చేసినట్లు స్పష్టం చేశారు. ఈ నెల 21న మునుగోడులో నిర్వహించే బహిరంగ సభలో అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు.
రచయిత గురించి
రావు
గోనె.మహేష్ సమయం తెలుగులో కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ వెబ్‌స్టోరీ విభాగానికి సంబంధించి స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్ సమాచారాన్ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.