యాప్నగరం

పార్టీ మారిన ఎమ్మెల్యేల చేతులు నరకాలి.. ఈసారి కాంగ్రెస్ రాకుంటే బానిస బతుకే: కోమటిరెడ్డి

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రాకపోతే రాష్ట్ర ప్రజలు బానిసలుగా బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి రాజీనామా చేయకుండా మరో పార్టీలో చేరిన నాయకుల రెండు చేతులు నరకాలన్నారు.

Authored byRaj Kumar | Samayam Telugu 18 Jun 2022, 9:53 am
టీఆర్ఎస్ పార్టీలో టికెట్ను పక్క రాష్ట్రం నుంచి వచ్చిన ప్రశాంత్ కిశోర్ (పీకే) ఇచ్చే దుస్థితి ఏర్పడిందని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. తెలంగాణను నిజంగా అభివృద్ధి చేసి ఉంటే పీకేతో పనేంటని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రాకపోతే రాష్ట్ర ప్రజలు బానిసలుగా బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు.
Samayam Telugu komatireddy venkat reddy


నల్గొండ జిల్లా నకిరేకల్‌లో శుక్రవారం రైతు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడారు. ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి రాజీనామా చేయకుండా మరో పార్టీలో చేరిన నాయకుల రెండు చేతులు నరకాలన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మూడు సార్లు టికెట్ ఇచ్చి, రెండు సార్లు ఎమ్మెల్యే‌గా గెలిపిస్తే ఆయన ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడో మీ అందరికి తెలుసంటూ పరోక్షంగా స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యపై మండిపడ్డారు.

ఈ ఏడాది డిసెంబర్లో ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదన్నారు కోమటిరెడ్డి.. కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రైతులు పండించిన పంటకు దిక్కు లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ అంటే రైతుల పార్టీ అని, అందుకే రైతు డిక్లరేషన్ ప్రకటించిందన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు దైద రవీందర్, శేఖర్, బోళ్ల వెంకట్రెడ్డి, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.
రచయిత గురించి
Raj Kumar

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.