యాప్నగరం

ప్రియురాలిపై పుస్తకం రాసిన ప్రియుడు.. షాకిచ్చిన యువతి.. చివరికి..

Suryapet: ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతణ్ని స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. కానీ అతని పరిస్థితి విషమంగా ఉంది.

Samayam Telugu 10 Jan 2021, 5:27 pm
సూర్యాపేట జిల్లాలో ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది. పెళ్లికి ప్రియరాలు ఒప్పుకోలేదని తీవ్ర మనస్తాపానికి గురైన ఒక యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సూర్యాపేట జిల్లా పిల్లలమర్రికి చెందిన రామన్ మునగాల అనే వ్యక్తి అదే మండలానికి చెందిన యువతిని పది సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యువతి కస్తూర్భాగాంధీ విశ్వవిద్యాలయంలో పని చేస్తుంది. అయితే యువతికి ఉద్యోగం వచ్చిన తర్వాత తనను పట్టించుకోవడం లేదని యువకుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
Samayam Telugu ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ వ్యక్తి
Suryapet suicide


తన ప్రేమకు గుర్తుగా యువకుడు ‘‘నేను.. నా అర్చన’’ (పేరు మార్చాం) పేరుతో ఒక పుస్తకం రాసి తన స్నేహితులకు కూడా పంచి పెట్టాడు. అంతే కాకుండా ప్రియురాలితో మాట్లాడిన కాల్ రికార్డింగులను కూడా స్నేహితులకు షేర్ చేశాడు. దీంతో విషయం తెలుసుకున్న ఆ యువతి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రాము తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.

ఈ క్రమంలోనే ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతణ్ని స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. కానీ అతని పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే అతన్ని ప్రభుత్వ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.