యాప్నగరం

త్వరలోనే మార్పు.. తిరుమలేశుడి సన్నిధిలో.. తెలంగాణ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తిరుమలేశుడిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 1 Jan 2021, 9:08 am
నూతన సంవత్సరాది సందర్భంగా.. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో తాను బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుందని 2019 జులైలోనే తాను చెప్పానన్నారు. రాబోయే రోజుల్లోనూ బీజేపీ ఎదుగుతుందనే భావనను ఆయన వ్యక్తం చేశారు.
Samayam Telugu komatireddy-rajagopal-reddy


కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్నప్పటికీ.. బీజేపీ గురించి తన అభిప్రాయాలను నిస్సంకోచంగా వెల్లడించానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీలో చేరే అవకాశాలు లేవన్నారు. అన్నాదమ్ముళ్లలా కలిసే ఉంటాం. కానీ నా సొంత అభిప్రాయం మేరకు పార్టీ మారుతున్నానంటూ రాజగోపాల్ రెడ్డి తెలిపారు.

తెలంగాణ కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి పీసీసీ చీఫ్ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు ప్రజల చేతుల్లో ఉందన్నారు. తెలంగాణ ప్రజానీకం శ్రేయస్సు దృష్ట్యా కొన్ని నిర్ణయాలను సీఎం కేసీఆర్ పునః సమీక్షించుకోవాలని ఆయన సూచించారు. ప్రజాస్వామ్యంలో ఒంటెద్దు పోకడలకు పోకుండా అన్ని పార్టీలను కలుపుకొని వెళ్లాలన్నారు.

తన అభిమాన నాయకుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేపట్టే ప్రతి పని విజయవంతం కావాలని శ్రీవారిని కోరుకున్నానని రాజగోపాల్ రెడ్డి మీడియాకు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.