యాప్నగరం

రోడ్డుపై వృద్ధుడికి నల్గొండ డీఎస్పీ సాయం.. ఇంతకీ ఆయనెవరో తెలుసా?

Nalgonda: నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి వెంటనే తన వాహనం అపి అతని వద్దకు వెళ్లారు. ఆ వృద్దుడు ఎక్కడికి వెళ్లాలో తెలుసుకొని తన వాహనంలో ఆ వ్యక్తి వెళ్లాల్సిన చోటుకు తీసుకొని వెళ్ళారు.

Samayam Telugu 23 Jan 2021, 3:54 pm
పోలీసులు తమ మానవత్వాన్ని చాటుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు నల్లగొండ డీఎస్పీ కూడా అలాగే వ్యవహరించి తన మంచి మనసు చాటుకున్నారు. ఆయన శనివారం ఒక వృద్ధుడికి సహాయం చేశారు. రోడ్డుపై నిలబడి ఆసరా కోసం ఎదురుచూస్తున్న ఒక వృద్ధుడిని గమనించిన నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి వెంటనే తన వాహనం అపి అతని వద్దకు వెళ్లారు. ఆ వృద్దుడు ఎక్కడికి వెళ్లాలో తెలుసుకొని తన వాహనంలో ఆ వ్యక్తి వెళ్లాల్సిన చోటుకు తీసుకొని వెళ్ళారు. అక్కడ దింపి అతని యోగ క్షేమాలు తెలుసుకొని మానవత్వాన్ని చాటుకున్నారు.
Samayam Telugu నల్గొండ డీఎస్పీ సాయం
nalgonda dsp


వివరాల్లోకి వెళితే.. సాయం పొందిన వ్యక్తి ఒక రిటైర్డ్ ప్రొఫెసర్, అంతేకాదు అంబేడ్కర్ వాది. తన వాగ్ధాటి, ఇంగ్లీష్ నైపుణ్యంతో ఎంతో మంది ఉన్నతాధికారులను సైతం విస్మయ పరిచిన వ్యక్తి. ఆయనే ఎం.ఎన్. భూషి. అలాంటి వ్యక్తి వృద్ధాప్యంలో రోడ్డుపై నిలబడి ఎవరి కోసమో వేచి చూస్తున్న విషయాన్ని అటు పక్కగా వాహనంలో వెళ్తున్న నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి గమనించారు. వెంటనే వాహనం ఆపి అతని వద్దకు వెళ్లి ఎక్కడికి వెళ్లాలో తెలుసుకున్నారు.

తన వాహనంలోనే ఆ రిటైర్డ్ ప్రొఫెసర్‌ను తీసుకువెళ్లి పట్టణంలోని రామాలయం వద్ద ఉన్న ఒక అపార్ట్‌మెంట్ దగ్గర దింపారు. అంతేకాకుండా ఆయన యోగ క్షేమాలు కూడా అడిగి తెలుసుకున్నారు. నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి తన హోదాను మరిచి సామాన్య వ్యక్తికి సహాయం చేసి మానవత్వం చాటుకున్న తీరుపై స్థానికులు పొగడ్తల వర్షం కురిపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.