యాప్నగరం

చనిపోయేందుకు రైల్వే ట్రాక్‌పై పడుకున్న యువకుడు.. అంతలో ఊహించని షాక్

భువనగిరి వద్ద రైల్వే ట్రాక్‌పై యువకుడు పడుకుని ఉన్నాడు. జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. కానీ అతనికి ఊహించని షాక్‌ ఎదురైంది.

Samayam Telugu 24 Jan 2021, 8:34 pm
ఆత్మహత్య చేసుకోవాలని భావించి రైల్వే ట్రాక్‌పై పడుకున్నాడో యువకుడు. రైలు కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో అనూహ్యంగా పోలీసులు ఎంట్రీ ఇచ్చి షాకిచ్చారు. అసలు ఆత్మహత్య చేసుకునే విషయం వారికెలా తెలిసిందో తెలియక కంగుతిన్నాడు. డయల్ 100 చేసిన సాయంతో ప్రాణాలతో బయటపడ్డాడు. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి మరీ యువకుడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ షాకింగ్ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
railway track


జీవితంపై విరక్తి చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని భువనగిరి సమీపంలో రైల్వే ట్రాక్‌పై పడుకున్నాడు. కొద్దిక్షణాల్లోనే యువకుడు సూసైడ్ చేసుకునేందుకు ట్రాక్‌పై పడుకున్నాడని డయల్ 100కి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసు సిబ్బంది పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులకు సమాచారం అందించారు. సకాలంలో స్పందించిన భువనగిరి పెట్రోలింగ్ పోలీసులు రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లి యువకుడికి షాకిచ్చారు. సురక్షితంగా తీసుకొచ్చారు.

అనంతరం భువనగిరి పోలీసులు యువకుడికి కౌన్సిలింగ్‌ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. సకాలంలో స్పందించి ఆగమేఘాల మీద సంఘటన స్థలానికి చేరుకుని నిండు ప్రాణాన్ని కాపాడిన పెట్రోలింగ్‌ వాహన సిబ్బంది రామారావు, శ్రీనివాస్‌లను రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ అభినందించారు. ఈ విషయాన్ని రాచకొండ పోలీసులు ట్విటర్‌లో షేర్‌ చేయడంతో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.