యాప్నగరం

కేంద్రానిది తుగ్లక్ పాలన.. వారే తీసుకొచ్చి వారే రద్దు చేస్తున్నరు: గుత్తా

Gutta Sukender Reddy: రూ.2 వేల నోట్ల ఉపసంహరణ కేంద్రం అనాలోచిత నిర్ణయానికి నిదర్శనమని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వారే నోట్లను తీసుకొచ్చి తిరిగే వారే రద్దు చేయటం తుగ్లక్ పాలనను తలపిస్తోందని దుయ్యబట్టారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 21 May 2023, 4:24 pm

ప్రధానాంశాలు:

  • రూ.2 వేల నోట్ల ఉపసంహరణపై మండలి ఛైర్మన్ గుత్తా ఫైర్
  • కేంద్రం తుగ్లక్ పాలనకు నిదర్శనమని వ్యాఖ్య
  • ఇది సరైంది కాదని హితవు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Demonetization: రూ.2 వేల నోట్ల చలామణిపై ఆర్బీఐ శుక్రవారం ( మే19) కీలక నిర్ణయం తీసుకుంది. ఆ నోట్లను ఉపసంహరించుకున్నట్లు సంచలన ప్రకటన చేసింది. సెంప్టెంబర్ 30 లోగా ప్రజలు తమ వద్ద ఉన్న రూ. 2 వేల నోట్లను బ్యాంకుల్లో గానీ, ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో గానీ మార్చుకోవాలని సూచించింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రధానంగా ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదురువుతున్నాయి. నోట్ల రద్దు పొరపాట్లను కప్పిపుచ్చుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రూ. 2 వేల నోట్లను ఉపసంహరించుకున్నట్లు ప్రకటన చేశారని అంటున్నారు. డైరెక్ట్‌గా ఆ విషయాన్ని మీడియా ముందు చెప్పలేక.. ఆర్బీఐతో చెప్పించారని ఆక్షేపించారు.
తాజాగా.. నోట్ల ఉపసంహరణపై తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పదించారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిని ప్రారంభించిన ఆయన మీడియాతో మాట్లాడారు. రూ.2 వేల నోట్ల ఉపసంహరణ కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయానికి నిదర్శనమని గుత్తా మండిపడ్డారు. కేంద్ర నిర్ణయం సామాన్య ప్రజలు ఇబ్బందులు తెచ్చిపెడుతోందని చెప్పారు. గతంలో రూ.500, రూ.1000 రద్దుచేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని గుర్తుచేశారు.

వారే రూ.2 నోటును తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు వారే రద్దు చేయటం తుగ్లక్ పాలనలా ఉందని ఎద్దేవా చేశారు. అర్థం పర్థం లేకుండా నోట్లను రద్దు చేసి ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని ఆక్షేపించారు. ప్రపంచంలో అత్యంత ఎక్కువ జనాభా కలిగిన దేశం భారతదేశమని.. ఇలాంటి దేశంలో ప్రజలను ఇబ్బంది పెట్టే నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరైన ఆలోచనతో దేశ ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటదని మండలి ఛైర్మన్ గుత్తా హితవు పలికారు.

  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.