యాప్నగరం

దేశం దాటిన భర్త.. దారితప్పిన భార్య, చివరికి..

కుటుంబం కోసం దేశాలు దాటిన భర్తకి అండగా ఉండాల్సింది పోయి పడక సుఖం కోసం పాకులాడింది. ప్రియుడి మోజులో పడి కట్టుకున్నోడిని కడతేర్చిన మహాఇల్లాలి బాగోతం వెలుగుచూసింది.

Samayam Telugu 10 Oct 2021, 10:01 pm
భార్యాబిడ్డలను బాగా చూసుకోవాలనే తలంపుతో దేశాలు దాటాడో భర్త. బాధ్యతల కోసం బంధాలను వదిలి దూరంగా వెళ్లిన కట్టుకున్నోడికి అండగా నివాల్సిన భార్య కట్టుబాట్లు తప్పింది. పెళ్లినాటి ప్రమాణాలు మరిచి శారీరక వాంఛల కోసం హద్దులు దాటింది. ఊళ్లో మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇంతలోనే భర్త తిరిగొచ్చేశాడు. ప్రియుడిపై ప్రేమ పెంచుకున్న భార్య కట్టుకున్న భర్తని ఆదరించలేకపోగా.. అంతం చేయాలని నిర్ణయించుకుంది. పడక సుఖం అందించేవాడి మోజులో పడి దారుణానికి ఒడిగట్టింది. భర్తని కిరాతకంగా హతమార్చింది. ఈ దారుణ ఘటన సూర్యాపేట జిల్లాలో వెలుగుచూసింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
affair


మేళ్లచెరువు మండలం కప్పలకుంట తండాలో దారుణం జరిగింది. భార్య కట్టుకున్న భర్తని కిరాతకంగా హతమార్చింది. సేకరించిన వివరాల మేరకు.. తండాకి చెందిన బాలాజీ(40) ఉపాధి కోసం నాలుగేళ్ల కిందట దుబాయ్ వెళ్లాడు. భార్య, బిడ్డలు ఇక్కడే సొంతూరులోనే ఉంటున్నారు. భర్తకి దూరంగా ఉంటున్న భార్య శారీరక సుఖం కోసం అడ్డదారులు తొక్కింది. గ్రామానికి చెందిన మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ప్రియుడితో రాసలీలలు సాగించింది. తీరా భర్త తిరిగొచ్చేసరికి ఇద్దరికీ ఇబ్బందిగా మారింది.

తమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య దారుణానికి ఒడిగట్టింది. ప్రియుడి మోజులో పడి భర్తని దారుణంగా హతమార్చింది. ఇద్దరు బిడ్డలు, ఒక బాబుని దిక్కులేని వారిని చేసింది. తండ్రి హత్య, తల్లి జైలుపాలు కావడంతో పిల్లలు అనాథలయ్యారు. హతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.