యాప్నగరం

ఊయలే ఉరితాడైంది.. ఆర్తనాదాలు వినేవారే లేక..!

Asifabad: ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఉయ్యాలలో ఆడుకుంటున్న బాలిక ఆ ఊయల తాడు మెడకు చుట్టుకోవడంతో ఊపిరాడక మృతి చెందింది. ఆ సమయంలో తల్లిదండ్రులు ఇంట్లో లేరు.

Samayam Telugu 2 Dec 2020, 10:20 pm
డుకునే ఉయ్యాలే ఆ బాలిక పాలిట యమపాశమైంది. పదేళ్లు కూడా నిండకుండానే నూరేళ్ల ఆయుష్షు నిండిపోయింది. ఊయల ఊగుతుండగా తాడు మెడకు చుట్టుకొని బాలిక మృతి చెందింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బాలికను కాపాడేవారే లేకుండాపోయారు. కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం నజ్రుల్‌నగర్‌ గ్రామంలో బుధవారం (డిసెంబర్ 2) ఉదయం ఈ విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Girl killed while playing with swing in Asifabad


నజ్రుల్‌నగర్‌ గ్రామానికి చెందిన సమర్‌ సర్కార్‌, బబితా సర్కార్‌ దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి నలుగురు కూతుళ్లు సంతానం. బుధవారం ఉదయం పొలం పనుల నిమిత్తం వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. పెద్ద కుమార్తెను వెంట తీసుకెళ్లారు. రెండో కుమార్తె రియా (10) ఇంటి వద్దే ఉండి ఇద్దరు చెల్లెళ్లను ఆడిస్తోంది.

బాలిక రియా ఊయల ఊగుతుండగా తిరగబడింది. తాడు మెడకు చుట్టుకుపోయి బిగిసుకుపోయింది. దీంతో రియా ఊపిరాడక మృతి చెందింది. అక్కకు ఏమైందో కూడా తెలియని స్థితిలో ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు విగతజీవిగా పడిఉన్న కుమార్తెను చూసి హతాశులయ్యారు. ఊయలే ఉరితాడై తమ గారాలపట్టి బలైన విషయం తెలుసుకొని గుండెలవిసేలా రోదించారు.

బాలిక రియా సర్కార్


సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. లోకం తెలియని చిన్నారులను ఒంటరిగా వదిలేస్తే ఎంత ప్రమాదకరమో ఈ ఘటన తెలుపుతోంది.

ఏప్రిల్‌లో ఖమ్మంలోనూ ఇలాంటి విషాదమే చోటు చేసుకుంది. తల్లిదండ్రులు ఇంట్లో మధ్యాహ్నం భోజనం చేస్తూ టీవీ చూస్తూ లీనమై ఉండగా.. ఇంటి ఆవరణలో ఉయ్యాల ఊగుతూ ఏడేళ్ల బాలిక కన్నుమూసింది. చీరతో కట్టిన ఉయ్యాలలో బాలిక ఊగుతుండగా అది మెడకు చుట్టుకొని ఊపిరాడక బాలిక మరణించింది.

Also Read: టీవీలో లీనమైన తల్లిదండ్రులు.. ఉయ్యాల ఊగుతూ బాలిక మృతి

Must Read: కోతుల దాడి.. మహిళ మృతి, సూర్యాపేటలో విషాదం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.