యాప్నగరం

తెలంగాణలో కరోనా కొత్త కేసుల తగ్గుముఖం.. 33 వేలు దాటిన కొవిడ్ కేసులు

Coronavirus in Telangana: జీహెచ్ఎంసీ పరిధిలోనే అధికంగా 736 కొత్త కేసులు నమోదు కావడం విస్మయం కలిగిస్తోంది. ఆ తర్వాత కేసుల తాకిడి అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో ఉంది.

Samayam Telugu 11 Jul 2020, 10:08 pm
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కానీ, గత మూడు రోజులుగా కొత్త కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. శనివారం మొత్తం 1,178 కరోనా కొత్త కేసులు నమోదైనట్లుగా హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 33,402కు చేరుకుంది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 12,135గా ఉన్నాయి. గత 24 గంటల్లో 1714 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకూ పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 20,919 కు చేరింది. ఇక శుక్రవారం మరో 9 మంది కరోనాకు బలి కాగా, మొత్తం చనిపోయిన వారి సంఖ్య 348కి చేరింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
coronavirus


శనివారం నాడు గుర్తించిన కరోనా కేసుల్లో జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున కేసులను గుర్తించారు. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే అధికంగా 736 కొత్త కేసులు నమోదు కావడం విస్మయం కలిగిస్తోంది. ఆ తర్వాత కేసుల తాకిడి అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో ఉంది. అక్కడ 125 కొత్త కేసులు నమోదు కాగా, ఆ తర్వాత మేడ్చల్ జిల్లాలో 101 కొత్త కరోనా కేసులను గుర్తించారు. దాని తర్వాతి స్థానంలో శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఉంది. ఇక్కడ 24 కేసులు నమోదయ్యాయి. ఇక జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.

coronavirus


Also Read: undefined

మరోవైపు, తెలంగాణలో శనివారం ఒక్కరోజే 11,062 కరోనా టెస్టులు నిర్వహించారు. వీటిలో నుంచే 1,178 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకూ తెలంగాణలో చేసిన కరోనా టెస్టుల సంఖ్య 1,62,171కు చేరింది. శనివారం 9,884 ఫలితాలు నెగెటివ్‌గా తేలాయి.

కరోనా టెస్టులు చేసే కేంద్రాలివీ..
గాంధీ మెడికల్ కాలేజీ, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి, పంజాగుట్ట నిమ్స్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం), కాకతీయ మెడికల్ కాలేజీ (వరంగల్), హైదరాబాద్ సీసీఎంబీ, సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్‌ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్, ఈఎస్ఐసీ, రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్), ఆదిలాబాద్‌లో కరోనా టెస్టులు చేస్తున్నట్లు వివరించారు.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.