యాప్నగరం

షాకింగ్! ఒకే ఫ్యామిలీలో 12 మందికి కరోనా.. సంగారెడ్డిలో కలకలం

Sangareddy: కరోనా సోకిందనే అనుమానంతో శనివారం హైదరాబాద్ మదీనగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి ఆ కుటుంబ సభ్యులు వచ్చి, అక్కడ 14 మందికి కరోనా పరీక్షలు చేయించుకున్నారు.

Samayam Telugu 18 Jul 2020, 8:57 pm
సంగారెడ్డి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన 12 మందికి కరోనా సోకడం కలకలం రేపుతోంది. జిల్లాలోని అమీన్‌పూర్‌ పట్టణంలోని ఓ కుటుంబంలో 12 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు శనివారం అధికారులు గుర్తించారు. ఈ మేరకు మున్సిపల్‌ కమిషనర్‌ సుజాత తెలిపారు. పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో నివాసముండే ఓ వ్యక్తి నాలుగు రోజులుగా కరోనా లక్షణాలైన గొంతు నొప్పి, జ్వరంతో బాధపడుతున్నాడు. అతనిది ఉమ్మడి కుటుంబం కావడంతో ఇంట్లో వారందరికీ అవే లక్షణాలు ఉన్నాయి.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
corona cases new


కరోనా సోకిందనే అనుమానంతో శనివారం హైదరాబాద్ మదీనగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి ఆ కుటుంబ సభ్యులు వచ్చి, అక్కడ 14 మందికి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో 12 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మున్సిపల్ కమిషనర్‌ సుజాత సిబ్బందితో వెళ్లి కాలనీలో రసాయనాలతో శుద్ధి చేయించారు. ఒకే కుటుంబంలో ఒకేసారి 12 మందికి కరోనా రావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

Must Read: నిజాం రహస్య నిధులు.. కేసీఆర్ సుదీర్ఘ వ్యూహమిదే.. రేవంత్ సంచలన ఆరోపణలు

మరోవైపు, సిద్దిపేట జిల్లాలోనూ రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. శనివారం ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా 23 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో డీహెచ్ అండ్ ఎంవో సిబ్బంది 5, గజ్వేల్ పోలీస్ స్టేషన్‌లో 3, చందళాపూర్‌లో 4, సిద్దిపేటలో 6, రంగనాయకసాగర్ ప్రాజెక్టు సిబ్బందిలో 2, ఆంక్షపూర్, కుకునూరుపల్లి, పెద్దకోడూర్‌లో ఒక్కొక్కటి చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా జిల్లాలో ఇప్పటివరకు 174 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Must Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.