యాప్నగరం

139 మంది రేప్ కేసు: మళ్లీ కథ అడ్డం తిప్పిన బాధితురాలు.. అన్నీ ట్విస్టులే!

Doller Bhai: సోమవారం ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగతో కలిసి పాల్గొన్న మీడియా సమావేశంలో బాధితురాలు ఈ విషయాలు చెప్పింది. తాజాగా ఆమె మరోసారి మాట మార్చింది.

Samayam Telugu 3 Sep 2020, 6:22 pm
139 మంది అత్యాచారం చేశారని నమోదైన సంచలన కేసులో రోజుకో మలుపు చోటు చేసుకుంటోంది. బాధితురాలే తాజాగా మరో ట్విస్ట్ ఇవ్వడం గమనించదగ్గ విషయం. దీంతో బాధితురాలు వరుసగా రెండోసారి ఇలా కథను మలుపుతిప్పినట్లయింది. తొలిసారిగా ఆమె పెట్టిన కేసులో తనపై 139 మంది అత్యాచారం చేశారని ఆరోపించింది. గత 9 ఏళ్ల పాటు వీరంతా తనపై 5 వేల సార్లు రేప్ చేశారని నల్గొండ జిల్లాకు చెందిన పాతికేళ్ల యువతి హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆమె మాట మార్చింది. తన ఫిర్యాదులో పేర్కొన్న కొన్ని పేర్లకు ఈ అత్యాచార కేసుకు ఏం సంబంధం లేదని చెప్పింది. డాలర్ భాయ్ అనే వ్యక్తికి భయపడి అతను చెప్పినట్లుగానే సెలబ్రిటీల పేర్లు కేసులో చేర్చానని చెప్పింది.
Samayam Telugu అత్యాచార బాధితురాలు, డాలర్ భాయ్
doller bhai


సోమవారం ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగతో కలిసి పాల్గొన్న మీడియా సమావేశంలో బాధితురాలు ఈ విషయాలు చెప్పింది. తాజాగా ఆమె మరోసారి మాట మార్చింది. ఈ మేరకు బాధితురాలు గురువారం ఓ ప్రకటన చేసింది. తనపై 139 మంది అత్యాచారం చేయలేదని, 36 మంది మాత్రమే అత్యాచారం చేశారని బాధితురాలు వివరించింది. 53 మంది తనను శారీరకంగా, మానసికంగా చిత్రహింసలు, వేధింపులకు గురి చేసినట్లు చెప్పింది.

రాజశ్రీకర్ రెడ్డి అలియాస్ డాలర్ భాయ్ తనను చిత్రహింసలకు గురి చేశాడని, అతని బలవంతం మేరకే సెలబ్రిటీల పేర్లు చేర్చాల్సి వచ్చిందని మరోసారి చెప్పింది. తొలుత డాలర్ బాయ్ కంపెనీలో ఉద్యోగం కోసం తాను వెళ్లానని, తన గురించి తెలుసుకున్న ఆయన తనను అన్ని రకాలుగా వాడుకున్నాడని ఆరోపించింది. డాలర్ మాజీ భార్య ఫిర్యాదుతో ఆయనపై సీసీఎస్ మహిళా పోలీసు స్టేషన్‌లో గతంలోనూ ఓ కేసు నమోదైందని వివరించింది.

బాధితురాలు తొలుత ఆరోపించిన వివరాలకు ఇప్పుడు చెబుతున్న విషయాలకు చాలా తేడా ఉండడంతో మరోసారి బాధితురాలి వాంగ్మూలాన్ని రికార్డు చేయాలని సీసీఎస్ పోలీసులు భావిస్తున్నారు.

Must Read: undefined

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.