యాప్నగరం

తెలంగాణలో మరో 1554 కరోనా కేసులు.. ఈ జిల్లాల్లో భారీగా నమోదు

Coronavirus Telangana: ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే అధికంగా 842 కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం. ఆ తర్వాత కేసుల తాకిడి అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో ఉంది.

Samayam Telugu 22 Jul 2020, 9:49 pm
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. బుధవారం మొత్తం 1554 కరోనా కొత్త కేసులు నమోదైనట్లుగా హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 49,259కు చేరింది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 11,155గా ఉన్నాయి. గత 24 గంటల్లో 1281 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకూ పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 37,666 కు చేరింది. అంటే బాధితుల రికవరీ రేటు 76.5 శాతంగా బులెటిన్‌లో పేర్కొన్నారు. ఇక బుధవారం మరో 9 మంది కరోనాకు బలి కాగా, మొత్తం చనిపోయిన వారి సంఖ్య 438కి చేరింది. మరణాల రేటు ఒక శాతం కన్నా తక్కువగా 0.88 శాతంగా ఉంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
corona tests 2


Must Read: తక్షణమే ఉస్మానియా హాస్పిటల్‌కు సీల్.. సర్కార్ సంచలన ఆదేశాలు

బుధవారం నాడు గుర్తించిన కరోనా కేసుల్లో జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున కేసులను గుర్తించారు. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే అధికంగా 842 కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం. ఆ తర్వాత కేసుల తాకిడి అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో ఉంది. అక్కడ 132 కొత్త కేసులు నమోదు కాగా, ఆ తర్వాత మేడ్చల్ జిల్లాలో 96 కొత్త కరోనా కేసులను గుర్తించారు. దాని తర్వాతి స్థానంలో బుధవారం కరీంనగర్ జిల్లా ఉంది. ఇక్కడ 73 కేసులు నమోదయ్యాయి.

Must Read: undefined

మరోవైపు, తెలంగాణలో బుధవారం ఒక్కరోజే 15,882 కరోనా టెస్టులు నిర్వహించారు. వీటిలో నుంచే 1554 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకూ తెలంగాణలో చేసిన కరోనా టెస్టుల సంఖ్య 3,08,959కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో మొత్తం 39 చోట్ల కరోనా పరీక్షలు జరుపుతున్నట్లుగా హెల్త్ బులెటిన్‌లో వివరించారు. వివిధ కొవిడ్ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న పడకల వివరాలు, హెల్త్ బులెటిన్ పూర్తి వివరాలకు కింది పీడీఎఫ్ ఫైల్ క్లిక్ చేయండి.

Must Read: డిప్యూటీ కలెక్టర్‌గా కల్నల్ భార్య.. పత్రాలు అందజేసిన సీఎం.. పోస్టింగ్‌పై కీలక ఆదేశాలు

TS . New Media Bulletin 22th July 2020 (2)

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.