యాప్నగరం

TS: 80 వేలకు చేరువలో కరోనా కేసులు.. ఈ జిల్లాల్లో దారుణంగా పరిస్థితి

Coronavirus Telangana: ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే అధికంగా 463 కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం. ఆ తర్వాత కేసుల తాకిడి అత్యధికంగా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో ఉంది.

Samayam Telugu 9 Aug 2020, 9:21 am
తెలంగాణలో శనివారం నాటి కరోనా కేసులకు సంబంధించిన హెల్త్ బులెటిన్‌ విడుదల చేశారు. శనివారం నాడు మొత్తం 1982 కరోనా కొత్త కేసులు నమోదైనట్లుగా పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 79,495కు చేరింది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 22,869గా ఉన్నాయి. గత 24 గంటల్లో 1669 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకూ పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 55,999 కు చేరింది. ఇక శనివారం మరో 12 మంది కరోనాకు బలి కాగా, మొత్తం చనిపోయిన వారి సంఖ్య 627కి చేరింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
man corona virus


శనివారం నాడు గుర్తించిన కరోనా కేసుల్లో జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున కేసులను గుర్తించారు. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే అధికంగా 463 కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం. ఆ తర్వాత కేసుల తాకిడి అత్యధికంగా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో ఉంది. అక్కడ 141 కొత్త కేసులు నమోదు కాగా, ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 139 కొత్త కరోనా కేసులను గుర్తించారు.

Must Read: undefined

మరోవైపు, తెలంగాణలో శనివారం ఒక్కరోజే 22,925 కరోనా టెస్టులు నిర్వహించారు. వీటిలో నుంచే 1982 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకూ తెలంగాణలో చేసిన కరోనా టెస్టుల సంఖ్య 6,13,231కు చేరింది. ఇప్పటి వరకూ సేకరించిన నమూనాల్లో మరో 1509 మంది ఫలితాలు తేలాల్సి ఉంది. ప్రస్తుతం తెలంగాణలో మొత్తం 39 చోట్ల కరోనా పరీక్షలు జరుపుతున్నట్లుగా హెల్త్ బులెటిన్‌లో వివరించారు. వివిధ కొవిడ్ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న సాధారణ, ఆక్సీజన్, వెంటిలేటర్ పడకల వివరాలు, జిల్లాల్లో గత ఏడు రోజుల్లో నమోదైన కేసుల వివరాలు.. హెల్త్ బులెటిన్ పూర్తి వివరాలకు కింది పీడీఎఫ్ ఫైల్ క్లిక్ చేయండి.

Must Read: undefined

Media Bulletin HCF As of 07.08.2020 dated 08.08.2020 (1)

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.