యాప్నగరం

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వారికి నో ఛాన్స్... కేసీఆర్ నిరాకరణ

ఈనెల 13న తెలంగాణ అసెంబ్లీ సమావేశం కానుంది. అయితే ఇదే అంశంపై అసెంబ్లీలో కూడా కేసీఆర్ చర్చించనున్నారు. ఇదే విషయాన్ని సభలో కూడా తెలపాలని సీఎం భావిస్తున్నారు.

Samayam Telugu 12 Oct 2020, 7:38 am
హైదరాబాద్‌ మహా నగరపాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) ఎన్నికలు మరో రెండు నెలల్లో జరగనున్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనే కొనసాగనుంది. జీహెచ్‌ఎంసీ పాలకవర్గ ఎన్నికల్లో రెండు దశాబ్దాలుగా ఇద్దరు పిల్లల వరకు ఉన్నవారే పోటీ చేయాలనే నిబంధన అమలవుతోంది. అయితే చట్టంలో దీనిని సవరించి, ఇద్దరి కంటే ఎక్కువమంది పిల్లలున్న వారికి పోటీచేసే అవకాశం కల్పించేందుకు సీఎం కేసీఆర్‌ నిరాకరించారు. కొత్త పురపాలకచట్టంలో రాష్ట్ర ప్రభుత్వం దీనిని సడలించింది. జీహెచ్‌ఎంసీ చట్టంలో ఇతర సవరణలతో పాటు ఈ ప్రతిపాదనను చేర్చారు.
Samayam Telugu సీఎం కేసీఆర్
cm kcr


ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలున్న వారిని అనుమతిస్తే ప్రభుత్వంపై అనవసరమైన అపోహలు వస్తాయని సీఎం మంత్రిమండలిలో చర్చ సందర్భంగా సూచించారు. ఈ నెల 13న జరిగే అసెంబ్లీ సమావేశాల చర్చలోనూ ఇదే విషయాన్ని తెలపాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ప్రస్తుత వార్డు రిజర్వేషన్లను కొనసాగించేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని సంప్రదించాకే ఈ ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికే గ్రేటర్ ఎలక్షన్ వార్‌కు సంబంధించి కొత్త పురపాలక చట్టంలో ఈ నిబంధన ఉండగా.. తాజాగా హెచ్‌ఎంసీ ముసాయిదా చట్ట సవరణ బిల్లులో కూడా ప్రతిపాదించారు.

Read More: నేడే నిజామాబాద్ ఎమ్మెల్సీ ఫలితం.. నాంపల్లి దర్గాలో కవిత ప్రత్యేక ప్రార్థనలు

అయితే జీహెచ్ఎంసీ మేయర్ రిజర్వేషన్‌కు మాత్రం ఈ నిబంధన వర్తించదు. గ్రేటర్ ఎన్నికల్లో 150 డివిజన్ల రిజర్వేషన్లను యథాతథంగా అమలు చేసేందుకు అధికారులు ప్రతిపాదించారు. అయితే దీని నుంచి మేయరు రిజర్వేషన్‌ను మినహాయించారు. ప్రస్తుతం బీసీ జనరల్‌ రిజర్వుడ్‌ కోటాలో బొంతు రామ్మోహన్‌ మేయరుగా ఉన్నారు. ఈ ఏడాది జీహెచ్‌ఎంసీ స్థానం జనరల్‌ మహిళ కేటగిరీకి ఎంపికైంది

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.