యాప్నగరం

17 మంది కూలీల ఆటో పల్టీలు.. వేర్వేరు ప్రమాదాల్లో పలువురి మృతి

Telangana Road Accidents: వేర్వేరు చోట్ల జరిగిన ఈ దుర్ఘటనల్లో నలుగురు వ్యక్తులు మరణించగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఇటిక్యాల మండలం దెయ్యాల వాగు వద్ద ఆగి ఉన్న చెరకు ట్రాక్టర్‌ను కారు ఢీకొట్టింది.

Samayam Telugu 23 Jan 2020, 11:40 am
తెలంగాణ వ్యాప్తంగా గురువారం ఉదయం కొన్ని చోట్ల రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వేర్వేరు చోట్ల జరిగిన ఈ దుర్ఘటనల్లో నలుగురు వ్యక్తులు మరణించగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఇటిక్యాల మండలం దెయ్యాల వాగు వద్ద ఆగి ఉన్న చెరకు ట్రాక్టర్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. కారు డ్రైవర్ ప్రాణాలతో బయట పడ్డాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులను గద్వాల ప్రాంతానికి చెందిన విజయ్, సునీల్, కిరణ్‌గా పోలీసులు గుర్తించారు.
Samayam Telugu accident-mbnr


Also Read:చలి కాలంలోనూ ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు.. కారణమదేనా?undefinedAlso Read: టీఆర్‌ఎస్ అభ్యర్థి ముక్కు కొరికేసిన కాంగ్రెస్ అభ్యర్థి

ఖమ్మం జిల్లాలోని కారేపల్లి మండలం బత్యా తండా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రోజువారి కూలీ కోసం టాటా ఏస్ వాహనంలో వెళ్తున్న కూలీలు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. మరో ఆటోను తప్పించబోయి అదుపుతప్పిన టాటా ఏస్‌ వాహనం పల్టీలు కొట్టింది. ఈ దుర్ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న 17 మంది కూలీలు గాయపడ్డారు. బాధితులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కూలీలంతా మిరప పంటలో పని చేసేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

Also Read: జగిత్యాల కలెక్టర్‌కు అరుదైన గుర్తింపు
Also Read:
తొలిసారిగా వచ్చా, కానీ నా ఓటు చెల్లుతుందా.. యువతి ఆవేదన
undefined
నల్గొండ జిల్లా నార్కట్‌ పల్లి శివారులో బైపాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. నార్కట్‌పల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జ్‌‌పై ముందు వెళ్తున్న ట్యాంకర్‌ను ఓ ప్రైవేటు ట్రావెల్స్‌కి చెందిన బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని క్షతగాత్రులను నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. బస్సు విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Also Read: మెట్రో షటిల్ తరహాలో స్టేషన్ల నుంచి కొత్త రకం సేవలు.. తక్కువ ధరకే!
Also Read:
ఎంపీ బండి సంజయ్ భద్రత తిరస్కరణకు కారణమదే..

ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చిన్నబోయినపల్లి వద్ద జరిగిన మరో కారు ప్రమాదంలో ఓ టీవీ ఛానల్ రిపోర్టర్ మృతి చెందారు. మృతుడు దామోదర్‌గా(35)గా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదానికి పొగమంచు కారణం అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. దారి సరిగ్గా కనపడక పోవడం వల్ల కారు డ్రైవర్‌ కల్వర్టును ఢీకొట్టి ఉంటాడని పోలీసులు అంచనా వేశారు.

Also Read: రాష్ట్రంలోకి మరో భారీ కంపెనీ.. పెట్టుబడులకు వచ్చే నెలలోనే..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.