యాప్నగరం

పెళ్లితో 50మందికి కరోనా... పాలకేంద్రం మూసివేత

ఓ పెళ్లిలో కరోనా కలకలం రేగింది. వేడుకకు హాజరైన 50మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో పాలకేంద్రం మూసివేశారు. పాలు కొనేందుకు భయంతో ఎవరూ ముందుకు రాకపోవడంతో పాల కేంద్రాన్ని 20 రోజుల పాటు మూసివేశారు.

Samayam Telugu 27 Aug 2020, 11:51 am
కరోనా కలకలం కొనసాగుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు నమోదవుతున్న కేసులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. కరోనా కారణంగా శుభకార్యాలు, పెళ్లిళ్లు కళ తప్పాయి. అతితక్కువమంది అతిథుల సమక్షంలో వేడుకలు నిర్వహిస్తున్న కరోనా మాత్రం వారిని వదలడం లేదు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వివాహాలు జరిపిస్తున్నా.. కరోనా మాత్రం ఎవర్నీ వదలడం లేదు. తాజాగా నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణ పరిధిలోని చెక్కీ క్యాంపులో కరోనా కేసులు కలకలంకు గురి చేస్తున్నాయి.
Samayam Telugu పెళ్లిలో కరోనా కలకలం
corona in nizamabad wedding


పది రోజుల కిందట జరిగిన ఓ వివాహ వేడుక కారణంగా 50 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. కేవలం 193 గృహాలున్న క్యాంపులో 42 ఇళ్లలోని వారికి వైరస్‌ సోకింది. అయితే వారి ఆదాయ మార్గమైన గేదెల ఆలనా పాలనా ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. మరోపక్క కొవిడ్‌ భయంతో ఇక్కడ పాలు కొనడానికి ఎవరూ రావడం లేదు. దీంతో పాల కేంద్రం 20 రోజులు మూసి ఉంచాలని నిర్ణయించారు.
Read More: గాంధీ ఆస్పత్రి నుంచి కరోనా సోకిన నలుగురు ఖైదీలు పరారీ
మరోవైపు తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈరోజు కొత్తగా 2,797 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 8 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం 1,14,483 కరోనా కేసులు నమోదు అవగా...మొత్తం 789 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం తెలంగాణలో 27,600 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 86,089 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా జీహెచ్‌ఎంసీ 449 కేసులు నమోదు అయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో 112 కేసులు రికార్డ్ అయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.